Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పూరి ఆకాష్ హీరోగా దర్శకుడు జీవన్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం 'చోర్ బజార్'. వీఎస్రాజు నిర్మాత. యూవీ క్రియేషన్స్ సమర్పణలో ఈ సినిమా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా బుధవారం హీరో పూరి ఆకాష్ మీడియాతో మాట్లాడుతూ, 'దర్శకుడు జీవన్ రెడ్డి నెరేట్ చేసిన ఈ కథలో బచ్చన్ సాబ్ హీరో క్యారెక్టరైజేషన్ చాలా బాగుంది. చోర్ బజార్ ఏరియా అంటే, అక్కడి వాళ్లు దొంగతనాలు చేస్తారని అనుకుంటాం. కానీ దగ్గరగా చూస్తే వాళ్ల జీవితాలు వేరుగా ఉంటాయి. అక్కడి మనుషులు, కుటుంబాలు, వాళ్ల కష్టాలు అవన్నీ ఈ సినిమాలో చూస్తారు. హీరో టైర్లు విప్పేసి, అమ్మే దొంగ. మీరు కార్ పార్క్ చేస్తే నిమిషాల్లో టైర్లు మాయం చేస్తాడు. ఇందులో రికార్డులు కూడా సాధించేస్తుంటాడు. అయితే ఆ డబ్బుతో అక్కడి పేదవారికి సాయం చేస్తుంటాడు. వాళ్లకు మాత్రం హీరో మంచి వాడు. నేను ఇప్పటిదాకా చేసిన చిత్రాల్లో ఇది భిన్నమైన సినిమా. పూర్తి కమర్షియల్ అంశాలతో హీరోయిజం ఎలివేట్ చేస్తూ సాగుతుంది. దర్శకుడు జీవన్ రెడ్డి గత చిత్రాల్లోనూ హీరోయిజం బాగా చూపించారు. నాకు కొత్త ఇమేజ్ క్రియేట్ అవుతుందని ఆశిస్తున్నాను. సీనియర్ నటి అర్చనతో కలిసి నటించడం సంతోషంగా ఉంది. ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాలు చాలా స్టైలిష్‌గా ఉంటాయి. క్లైమాక్స్ పదిహేను నిమిషాలు అదిరిపోతుంది. ఫైట్ మాస్టర్ పథ్వీ బాగా ఫైట్స్ కంపోజ్ చేశారు. వజ్రం ఈ సినిమాలో కీ రోల్ ప్లే చేస్తుంది. డైమండ్ ఒక క్యారెక్టర్‌గా కనిపిస్తుంది. హీరోయిన్ మూగ అమ్మాయిగా ఉంటుంది అనగానే నాకు ఎగ్జైటింగ్‌గా అనిపించింది. పాటలు, ట్రైలర్ చూశాక నాన్న పూరి జగన్నాథ్ ..సినిమా బాగుందిరా గ్రాండ్‌గా కనిపిస్తుంది అని చెప్పారు. ఈ సినిమా ఓ సరికొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. వెబ్ సిరీస్‌ల్లో నటించడం ఇష్టమే కానీ నా మొదటి ప్రాధాన్యం సినిమాకే. ప్రస్తుతం రెండు, మూడు ప్రాజెక్ట్స్ ఉన్నాయి' అని తెలిపారు.