Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''పక్కా కమర్షియల్' సినిమాలో నా పాత్రను దర్శకుడు మారుతి చాలా భిన్నంగా డిజైన్ చేశారు. జూనియర్ లాయర్‌గా ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తాననే నమ్మకం ఉంది' అని అంటున్నారు హాస్యనటుడు ప్రవీణ్.
గోపీచంద్, మారుతి కాంబినేషన్లో రూపొందుతున్న సినిమా 'పక్కా కమర్షియల్'. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్ - యూవీ క్రియేషన్స్ పతాకాలపై బన్నీ వాస్ నిర్మిస్తున్నారు. జూలై 1న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ప్రవీణ్ బుధవారం మీడియాతో మాట్లాడుతూ, 'మారుతిగారితో నా ప్రయాణం ఇప్పటిది కాదు. మా ఇద్దరి వేవ్‌లెంగ్త్ బాగుంటుంది. ఎలాంటిదైనా సరే స్పాట్లోనే కామెడీ వచ్చేలా చేయటంలో మారుతి దిట్ట. ఈ సినిమాలో నేను గోపీచంద్‌గారికి జూనియర్ లాయర్‌గా నటించా. ఆయనతో గతంలోనూ రెండు, మూడు సినిమాల్లో నటించా. గోపీచంద్, రాశీఖన్నా కాంబినేషన్లో నేను నటించిన సన్నివేశాలు ప్రేక్షకుల్ని బాగా నవ్విస్తాయి. టైటిల్‌కి తగ్గట్టుగానే ఈ సినిమా పక్కా హిట్ గ్యారెంటీ. ముఖ్యంగా మారుతిగారికి మంచి పేరొస్తుంది. తనదైన పంధాలో ఈ సినిమా చేశారు. ప్రేక్షకులను నవ్వించటమే నా లక్ష్యం' అని చెప్పారు.