Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర నిర్మాత ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన తాజా సినిమా '7 డేస్ 6 నైట్స్'. సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ సమర్పణలోహొసుమంత్ అశ్విన్.ఎం, రజనీకాంత్.ఎస్ నిర్మించారు.
వైల్డ్ హనీ ప్రోడక్షన్స్, వింటేజ్ పిక్చర్స్, ఏబిజి క్రియేషన్స్ చిత్ర నిర్మాణంలో భాగస్వాములు. సుమంత్ అశ్విన్, రోహన్హొహీరోలు. మెహర్ చాహల్, కతికా శెట్టి హీరోయిన్లు. ఈనెల 24న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఎం.ఎస్.రాజు మీడియాతో మాట్లాడుతూ, ''రాజ్ కపూర్ 'బర్సాత్' చూశా. అందులో రెండు పాత్రలు నాకు బాగా నచ్చాయి. వాటిని స్ఫూర్తిగా తీసుకుని ఈ సినిమా కథ రాశా.హొ'బర్సాత్'లో రాజ్ కపూర్ క్యారెక్టర్ తరహాలో సుమంత్ పాత్ర ఉంటుంది. కేర్లెస్ రోల్. జీవితంలో అతడికి ఒక లక్ష్యం ఉంటుంది. దాన్ని ఇంకా చేరుకోలేదు. మరో వైపు ప్రేమించిన అమ్మాయి అమెరికా వెళుతుంది. డాక్టర్‌కు సైతం అందని డిప్రెషన్లో ఉంటాడు. 'బర్సాత్'లో రాజ్ కపూర్ ఫ్రెండ్ రోల్ ప్రేమనాథ్ చేశారు. ఈ సినిమాలో ఆ పాత్రని రోహన్ చేశాడు. అయితే కథ, నేపథ్యాలు మాత్రం వేర్వేరు. నిర్మాతగా నేను విజయాలు సాధించా. అయితే, దర్శకుడిగా ఆశించిన విజయాలుహొఅందుకోలేదు. అందుకని, పట్టుదలతో '7 డేస్ 6 నైట్స్' కథ రాశా. గోవాలో యువతహొతిరిగే ప్రదేశాలు తిరిగా. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారోహొఅని చాలా రీసెర్చ్ చేశా. '7 డేస్ 6 నైట్స్' అంటే ఏదో అమ్మాయిలను తీసుకుని బీచ్‌కు వెళ్లడం కాదు. ఇందులో ఎమోషనల్ కంటెంట్ చాలా ఉంది. ఇంటర్వెల్ నుంచి ప్రేక్షకులు ఒక ట్రాన్స్‌లోకి వెళతారు. అశ్విన్, రోహన్, మెహర్ చాహల్, కృతికా శెట్టి అద్భుతంగా నటించారు. నా కథ ద్వారా ఏదైతే ప్రేక్షకులకు చెప్పాలనుకున్నానో దాన్ని వీళ్ళు నూటికి నూరుశాతం వెండితెరపై ప్రజెంట్ చేశారు. కథ, పాత్రలు, నేపథ్య పరంగా ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పిస్తుంది. ఇది అడల్ట్ కంటెంట్ సినిమా కాదు. సెన్సార్ దీనికి 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చింది. ట్రైలర్ విడుదల చేశాక మంచి రెస్పాన్స్ వచ్చింది. తక్కువ ధరలకే టికెట్లతోపాటు థియేటర్ల సంఖ్య కూడా పెంచాం. 'సతి' సినిమా కంప్లీట్ చేశాను. రాజమండ్రి లాంటి ప్రాంతంలో భార్యాభర్తల మధ్య జరిగే కథతో తీసిన సినిమా 'సతి'. మిస్టరీ జోనర్ సినిమా. గతంలో నేను తీసిన ఓ సినిమాకి సీక్వెల్ ప్లాన్ చేస్తున్నాను. దీన్ని 14 భాషల్లో తీస్తాం. అక్టోబర్‌లో స్టార్ట్ చేస్తాం. చాలా పెద్ద స్కేల్లో ఉంటుంది' అని చెప్పారు.