Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ ధనలక్ష్మీ మూవీస్ పతాకంపై ఎమ్.వినరు బాబు దర్శకత్వంలో బీసు చందర్ గౌడ్ నిర్మిస్తున్న చిత్రం 'సీతారామపురంలో ఒక ప్రేమ జంట'. రణధీర్ హీరోగా, నందిని రెడ్డి హీరోయిన్గా పరిచయం అవుతున్నారు. గురువారం ప్రసాద్ ల్యాబ్స్‌లో ఈ చిత్ర టీజర్ ఆవిష్కరణ వేడుక మంత్రి శ్రీనివాస్ గౌడ్ చేతుల మీదుగా వైభంగా జరిగింది.
ఈ సందర్భంగా దర్శకుడు వినరు బాబు మాట్లాడుతూ;'ఈ కథ అందరికీ నచ్చేలా ఉంటుంది. ప్రతి పాత్ర ప్రేక్షకుడికి కనెక్ట్ అవుతుంది. డిఫరెంట్ వేలో ఆలోచించి, తీసిన లవ్ స్టోకీ ఇది. ప్రేమించడం కాదు...ఆ ప్రేమను నిలబెట్టుకోవాలన్న అంశాన్ని మా చిత్రం ద్వారా చూపిస్తున్నాం. ఎక్కడా వల్గారిటీకి తావుండదు. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చే విధంగా సినిమా ఉంటుంది. క్వాలిటీ పరంగా ఎక్కడా రాజీ పడకుండా మా నిర్మాత సహకరించారు. హీరో, హీరోయిన్స్ కొత్త వారైనా ఎంతో అనుభవం ఉన్నవారిలా నటించారు. త్వరలో సినిమాను గ్రాండ్‌గా రిలీజ్ చేస్తాం' అని చెప్పారు.
'మా దర్శకుడు వినరు బాబు చెప్పిన కథ నచ్చి మా అబ్బాయి రణధీర్‌ని హీరోగా పరిచయం చేస్తూ ఈ సినిమా నిర్మించాను. గ్రామీణ వాతావరణంలో జరిగే చక్కటి ప్రేమకథా చిత్రమిది. కథలో మంచి మలుపులు ఉన్నాయి. విడుదలైన పాటలకు మంచి స్పందన వస్తోంది. సినిమా అవుట్ పుట్ బాగా వచ్చింది' అని నిర్మాత బీసు చందర్ గౌడ్ అన్నారు.
హీరో రణధీర్ మాట్లాడుతూ,' మా డీఓపీ గారు నన్ను ప్రతి ఫ్రేమ్‌లో ఎంతో అందంగా చూపించారు. గణేష్ మాస్టర్ మా సినిమాకు అద్బుతమైన కొరియోగ్రఫీ అందించారు. ఈ సినిమాతో మంచి గుర్తింపు లభిస్తుందని ఆశిస్తున్నాను' అని చెప్పారు.