Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ వెంకటేశ్వర ఫిలిమ్స్ పతాకంపై యస్వంత్, జబర్దస్త్ రాకింగ్ రాకేష్, అనన్య, హిందోలా చక్రవర్తి, పూజ, సిమ్రాన్ నటీనటులుగా రేలంగి నరసింహారావు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఊ అంటావా మావా ఊఊ అంటావా మావ'.
తుమ్మల ప్రసన్నకుమార్ నిర్మిస్తున్న ఈ చిత్రం రెండు పాటలు మినహా షూటింగ్ పూర్తి చేసుకుంది.
ఈ రెండు పాటల షూటింగ్ కోసం యూనిట్ కాశ్మీర్‌కు వెళ్తున్న సందర్భంగా ఫిల్మ్ ఛాంబర్లో సినీ ప్రముఖుల సమక్షంలో మేకర్స్ టైటిల్‌ని ప్రకటించారు. ఈ వేడుకకు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షులు కొల్లి రామకష్ణ, ఫిలిం ఛాంబర్ ప్రధాన కార్యదర్శి దామోదర్ ప్రసాద్ చిత్ర టైటిల్‌ను ఎనౌన్స్ చేశారు.
దర్శకుడు రేలంగి నరసింహారావు మాట్లాడుతూ,'ఇప్పటి వరకు చేసిన కామెడీ సినిమాలకు భిన్నంగా ఉండాలని కామెడీ డెవిల్స్, ఎన్నో హర్రర్ సినిమాలు వచ్చాయి. అయితే ఇది పూర్తి హర్రర్ సినిమా కాదు. వినోదమూ ఉంటుంది. ప్రసన్న కుమార్ గారికి ఈ సినిమా చాలా ప్లస్ అవుతుంది. జూలై చివరి వారంలో సినిమాను విడుదల చేస్తాం' అని అన్నారు.
'ఇప్పటి వరకు వచ్చిన కామెడీ సినిమాలు ఎలా చరిత్ర సష్టించాయో ఇప్పుడు వస్తున్న మా సినిమా కూడా చరిత్ర సష్టిస్తుందని మనస్ఫూర్తిగా నమ్ముతూ ఈ సినిమా చేశాం. గతంలో 76 సినిమాలతో సూపర్ హిట్ ఇచ్చిన దర్శకుడు మా రేలంగి నరసింహారావు. ఆయన దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా కూడా సూపర్ హిట్ అవుతుంది. డి.ఓ.పి శంకర్ గారు డబ్బు కోసం కాకుండా ఎమోషన్‌కు పని చేస్తారు. తన కెమెరా పనితనం ఎంతో అద్భుతంగా ఉంటుంది' అని నిర్మాత తుమ్మల ప్రసన్నకుమార్ చెప్పారు.