Authorization
Mon Jan 19, 2015 06:51 pm
విశ్వక్ సేన్, ఐశ్వర్య అర్జున్ జంటగా అర్జున్ సర్జా స్వీయ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ఘనంగా ప్రారంభమైయింది. అర్జున్ సొంత బ్యానర్ శ్రీరామ్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ పతాకంపై ప్రొడక్షన్ నెం15గా నిర్మితమవుతున్న ఈ సినిమాతో అర్జున్ కుమార్తె ఐశ్వర్య అర్జున్ తెలుగులో కథానాయికగా పరిచయం అవుతున్నారు. ఈ చిత్రం పూజా కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ ముఖ్య అతిథిగా హాజరై, క్లాప్ కొట్టి చిత్ర యూనిట్‌కి బెస్ట్ విషెస్ అందించారు. తొలి షాట్‌కి దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు దర్శకత్వం వహించగా, ప్రకాష్ రాజ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. మంచు విష్ణు స్క్రిప్ట్‌ని యూనిట్‌కి అందజేశారు.
ఈ సందర్భంగా హీరో విశ్వక్ సేన్ మాట్లాడుతూ, 'అర్జున్ గారు కలవాలని అడిగితే షాక్ అయ్యా. ఎందుకో అర్థం కాలేదు. 'నేను డైరెక్ట్ చేస్తున్న కథ చెప్తా విను' అనగానే చాలా సర్ప్రైజ్ అయ్యా. ఇది నా విష్ లిస్ట్‌లో ఉన్న సినిమా. అంత గొప్ప కథ' అని చెప్పారు.
దర్శక, నిర్మాత, రచయిత అర్జున్ మాట్లాడుతూ, 'ఇన్నేళ్ళుగా నన్ను ఆదరిస్తున్న తెలుగు ప్రేక్షకులు నా కుమార్తె ఐశ్వర్య అర్జున్‌ని కూడా ఆదరిస్తారని ఆశిస్తున్నాను. మీ అంచనాలకు ఏ మాత్రం తగ్గకుండా కష్టపడి పని చేస్తుందనే నమ్మకం ఉంది. ఇదొక మంచి ఫీల్ గుడ్ మూవీ. చాలా అరుదైన జోనర్. ఈ కథ చెప్పగానే మరో ఆలోచన లేకుండా నటులు, టెక్నిషియన్స్ ఈ ప్రాజెక్ట్ చేస్తామని చెప్పారు. అందరికీ ఇంత నమ్మకం ఉన్నప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన సినిమా చేయాలనే భయం ఉంది. మా హీరో విశ్వక్ వండర్ ఫుల్ హీరో. దర్శకుడిగా ఇది 13వ సినిమా. నిర్మాతగా 15వ సినిమా. సాయి మాధవ్ బుర్రా గారు మాటలు, బాలమురగన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఈ సినిమా విజువల్ ఫీస్ట్‌గా ఉంటుంది. ''కేజీఎఫ్'తో పాన్ ఇండియా మ్యూజిక్ డైరెక్టర్ అయిన రవి బసూర్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఒక మంచి సినిమాని తెలుగు చిత్ర పరిశ్రమకి ఇస్తాననే నమ్మకం ఉంది. త్వరలోనే టైటిల్‌ని ప్రకటిస్తాం' అని తెలిపారు.