Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సినీ కార్మికుల సమ్మె విరమణ
45 శాతం వేతనాల పెంపుదలకు నిర్మాతల నుండి స్పష్టమైన హామీ రావడంతో గత రెండు రోజులుగా సమ్మె చేస్తున్న సినీ కార్మికులు విరమించారు. రాష్ట్ర సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నంలో సఫలం అయ్యారు.
ఈ చర్చల్లో వేతనాలు పెంచేందుకు నిర్మాతలు, షూటింగ్స్‌లో పాల్గొనేందుకు సినీ కార్మికులు గ్రీన్ సిగల్ ఇచ్చారు. కార్మికుల వేతనాల పెంపు కోసం నిర్మాత దిల్ రాజు అధ్యక్షతన ఓ సమన్వయ కమిటీని ఏర్పాటు చేశారు. ఈ కమిటీ ఆధ్వర్యంలో నేడు (శుక్రవారం) జీతాల పెంపు విషయమై నిర్మాతలందరితో చర్చలు జరిపి, విధివిధానాలను ప్రకటిస్తామని ఫిల్మ్ ఛాంబర్ ప్రతినిధులు తెలిపారు. చర్చలు సఫలం అవడంతో రేపటి నుండి (శుక్రవారం) యథావిధిగా సినిమా షూటింగ్స్ జరుగుతాయని, పెరిగిన జీతాలు రేపటి నుండే అమలులోకి వస్తాయని ఫిల్మ్ ఫెడరేషన్ అధ్యక్షుడు వల్లభనేని అనిల్ కుమార్ చెప్పారు.
మంత్రి తలసానిగారి చొరవతో జరిగిన సమావేశంలో అన్ని విషయాలు చర్చకు వచ్చాయని, వేతనాలు పెంచడానికి నిర్మాతలు సిద్ధమయ్యారని, కో ఆర్డినేషన్ కమిటీ ద్వారా అన్ని సమస్యలను పరిష్కరించుకుంటామని, ఈ విషయంలో సహకరించిన అందరికీ థ్యాంక్స్ అని అనిల్‌కుమార్ అన్నారు.