Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పవర్‌ఫుల్ ఐపీఎస్ ఆఫీసర్ సత్య పాత్రలో రామ్ కనిపించనున్న సినిమా 'ది వారియర్'. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కుతోంది. తమిళ అగ్ర దర్శకుడు లింగుస్వామి దర్శకుడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మిస్తున్నారు. జూలై 14న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. ఈ సినిమాలోని 'విజిల్' సాంగ్‌ను బుధవారం అగ్ర హీరో సూర్య ట్విట్టర్ ద్వారా రిలీజ్ చేశారు. హైదరాబాద్‌లో అభిమానుల సమక్షంలో ఈ సాంగ్ లిరికల్ వీడియో ప్రదర్శించారు.
ఈ సందర్భంగా రామ్ మాట్లాడుతూ, 'దేవి శ్రీ ప్రసాద్ బ్లాక్ బస్టర్ ఆల్బమ్ ఇచ్చాడు. 'బుల్లెట్...' సాంగ్ సౌత్ ఇండియా అంతా షేక్ చేస్తోంది. 'విజిల్' సాంగ్‌కు కూడా సూపర్ డూపర్ హిట్ ట్యూన్ ఇచ్చాడు. నెక్స్ట్ సాంగ్స్ కూడా విన్నాను. ఇది టిక్ టాక్ సాంగ్ కాదు, థియేటర్ సాంగ్. థియేటర్లకు వచ్చి ఎంజారు చేసి వెళ్ళండి. అభిమానుల కోసం సినిమాలో చాలా ఉన్నాయి. దర్శకుడు లింగుస్వామి గారు అద్భుతంగా సినిమా తీశారు. నేను పని చేసిన బెస్ట్ డైరెక్టర్స్‌లో ఆయన ఒకరు' అని చెప్పారు.
'విజిల్ మహాలక్ష్మి కోసం ఒక విజిల్ సాంగ్ సిట్యువేషన్ క్రియేట్ చేసినందుకు లింగుస్వామి గారికి థ్యాంక్స్. 'ఉప్పెన' తర్వాత డీఎస్పీ గారితో నేను చేస్తున్న చిత్రమిది. సూపర్ సాంగ్స్ ఇచ్చారు' అని నాయిక కృతి శెట్టి అన్నారు.
దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ, 'ఈ 'విజిల్' సాంగ్ అద్భుతమైన సందర్భంగా సినిమాలో వస్తుంది. సాంగ్ వచ్చేటప్పుడు ప్రేక్షకులు అందరూ పెద్ద పెద్ద విజిల్స్ వేస్తారని అనుకుంటున్నాను. షార్ట్ వీడియోస్‌లో 900 కోట్ల మంది 'బుల్లెట్' సాంగ్ చేశారు. త్వరలో వెయ్యి కోట్ల మార్క్ చేరుకోవచ్చు. 'బాహుబలి' వెయ్యి కోట్లు కలెక్ట్ చేసింది. నా సాంగ్ షార్ట్ వీడియోస్ రూపంలో వెయ్యి కోట్లు చేరుకుంది. ప్రేక్షకుల ఆశీర్వాదంతో సినిమా కూడా పెద్ద హిట్ అవుతుందని ఆశిస్తున్నాను. మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరి సాంగ్స్, సినిమా కోసం ఏం అడిగితే అది ఇచ్చారు' అని తెలిపారు.