Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ లక్ష్మి నరసింహ సినీ క్రియేషన్స్ పతాకం పై 'నిమ్స్' శ్రీహరి రాజు దర్శకత్వంలో రూపొందిన సినిమా 'విశాలాక్షి'. ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ వేడుక ప్రసాద్ లాబ్స్‌లో సందడిగా జరిగింది. నిర్మాత సి. కళ్యాణ్ ట్రైలర్ లాంచ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ఈ సినిమా ట్రైలర్ చూశాక ఇదొక దెయ్యం సినిమా అని అర్థమైంది. దెెయ్యం సినిమాలకి ప్రత్యేకంగా ప్రేక్షకులు ఉంటారు. నేను తీసిన దెయ్యం సినిమాలకి బాగా డబ్బులు వచ్చాయి. ఈ సినిమాకి కూడా డబ్బులు వస్తాయి. ఈ చిత్ర దర్శకుడు శ్రీహరి రాజు గారు నిమ్స్ హాస్పిటల్లో పని చేశారు. సినిమా రంగం నుండి ఎవరు హాస్పిటల్‌కి వెళ్లిన ఎంతో సాయం చేశారు. ఆయన రిటైర్ అయిన తర్వాత తన 40 ఏళ్ళ కలని నిజం చేసుకోవడానికి ఈ సినిమా తీశారు. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుంది' అని తెలిపారు. దర్శకుడు నిమ్స్ శ్రీహరి రాజు మాట్లాడుతూ,'ఎడిటింగ్, డబ్బింగ్ దశలో, ఇప్పుడు ట్రైలర్ చూసిన వారంతా చాలా బాగుంది అని అభినందిస్తున్నారు. ఈ సినిమా రూపకల్పనలో మహేష్ చంద్ర సహకారం మరువలేనిది' అని చెప్పారు. 'డైరెక్టర్ నిమ్స్ శ్రీహరి రాజు గారికి అనుభవం లేకపోయినా, సినిమా మీద పూర్తి అవగాహన ఉంది. మంచి సినిమా తీశారు. ఈ సినిమాలో నేను సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా నటించాను' అని దర్శకుడు మహేష్ చంద్ర అన్నారు.
నిర్మాతలు ఎన్.వి.సుబ్బరాజు, డి.విజయకుమార్ రాజు, బి. శ్రీనివాసరెడ్డి, డి.శ్రీహరిరాజు మాట్లాడుతూ,'సినిమాని మంచి క్వాలిటీతో తీశాం. త్వరలోనే సెన్సార్ పూర్తి చేసి, రిలీజ్ చేస్తాం' అని తెలిపారు.
ఈస్ట్ వెస్ట్ ఎంటెర్టైనెర్స్ సంస్థ సీఈఓ రాజీవ్ ఈ సినిమాని థియేటర్స్‌లో రిలీజ్ అయిన తర్వాత ఓటిటిలో రిలీజ్ చేస్తామని హామీ ఇచ్చారు. హీరో సూర్య తేజ, సంగీత దర్శకుడు సంతోష్ కావల, కొరియోగ్రాఫర్స్ సతీష్ రాజ్, కెమెరామాన్ కుర్ర చింతయ్య తదితరులు ఈ వేడుకలో పాల్గొని ఈ సినిమాకి పని చేయటం ఎంతో ఆనందందగా ఉందని, ఈ సినిమా తప్పకుండా మంచి విజయం సాధిస్తుందని ఆకాంక్షించారు.