Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అనసూయ ప్రధాన పాత్రలో 'పేపర్ బాయ్' దర్శకుడు జయశంకర్ దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'అరి'. ఆర్వి రెడ్డి సమర్పణలో ప్రముఖ వ్యాపారవేత్తలు శేషు మారం రెడ్డి, శ్రీనివాస్ రామిరెడ్డి సంయుక్తంగా ఈ సినిమాని నిర్మిస్తున్నారు.
సాయికుమార్, వైవాహర్ష, శుభలేఖ సుధాకర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్ర టైటిల్ లోగోను శుక్రవారం జరిగిన ఓ ప్రత్యేక కార్యక్రమంలో హుజూరాబాద్ ఎం.ఎల్.ఎ. శానంపూడి సైదిరెడ్డి, 'అఖండ' నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి సంయుక్తంగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా దర్శకుడు జయశంకర్ మాట్లాడుతూ, ''అరి' అనేది సంస్కత పదం. శత్రువు అని అర్థం. అది ఏమిటి అనేది సినిమాలో చెప్పాను. అనసూయగారు కథ చెప్పగానే అంగీకరించారు. అనూప్గారు మూడు మంచి ట్యూన్స్ ఇచ్చారు. 'పేపర్బారు' కంటే ఈ సినిమాకు మరింత మంచి పేరు వస్తుందనే నమ్మకం ఉంది' అని అన్నారు. 'దర్శకుడు కథ చెప్పినప్పుడే చాలా ఆసక్తి కలిగింది. 'రంగస్థలం'లో రంగమ్మత్తగా చేశాక ఇంత పేరు వస్తుందని అనుకోలేదు. నా కోసం పాత్రలు రాస్తున్నారు. 'పుష్ప' చాలా సంతప్తినిచ్చింది. రెండో భాగంలో మంచి పాత్ర ఉంది. ఈ సినిమాలో హ్యూమానిటీతోపాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉంది. ఎలా బతకకూడదనే విషయాన్ని ఎంటర్టైన్గా దర్శకుడు చూపించారు' అని అనసూయ చెప్పారు.
నిర్మాత శేషు మాట్లాడుతూ, 'మనిషి ఎలా బతకాలో అనేది ఇంతకుముందు చాలా సినిమాలు చూపించాయి. కానీ మా సినిమా మనిషి ఎలా బతకకూడదో చూపిస్తుంది. మంచి విజన్ ఉన్న దర్శకుడు జయశంకర్. 'పేపర్ బారు' కన్నా వందరెట్లు ఈ సినిమా ఉంటుంది. అనూప్ మంచి ట్యూన్స్ ఇచ్చాడు. అనూప్ లేకపోతే ఈ సినిమా ఉందేడది కాదు' అని తెలిపారు. 'ఇండిస్టీలో ఎంతో మంది ప్రతిభావంతులు ఉన్నారు. వారిని గుర్తించి, వెలుగులోకి తెచ్చేందుకు ఈ బ్యానర్ స్థాపించాం. మళ్ళీ మళ్ళీ చూసే విధంగా సినిమాని తీశారు' అని మరో నిర్మాత శ్రీనివాసరెడ్డి అన్నారు.