Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయి రామ్ శంకర్, యషా శివ కుమార్ జంటగా నవీన్ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'వెయ్ దరువెయ్'. శంకర్ పిక్చర్స్ సమర్పణలో సాయి తేజ ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న చిత్రమిది. ఈ చిత్ర పూజా కార్యక్రమం శుక్రవారం రామానాయుడు స్టూడియోలో సినీ ప్రముఖుల మధ్య అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. ముఖ్య అతిథులుగా విచ్చేసిన హీరో శర్వానంద్ హీరో, హీరోయిన్‌పై చిత్రీకరించిన ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టగా, మరో హీరో అల్లరి నరేష్ కెమెరా స్విచ్చాన్ చేశారు. హీరో విశ్వక్ సేన్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా హీరో సాయి రామ్ శంకర్ మాట్లాడుతూ, 'ఎస్.ఆర్ కల్యాణ మండపం' సినిమా తర్వాత శంకర్ పిక్చర్స్‌తో దేవరాజ్ పొత్తూరు నిర్మిస్తున్న మాస్ ఎంటర్ టైనర్ ఇది. దర్శకుడు నవీన్ రెడ్డి చెప్పిన కథ విన్న తరువాత, నాకు 'బంపర్ ఆఫర్' తర్వాత అలాంటి బాడీ లాంగ్వేజ్ ఉన్న కథ లభించడం అదష్టంగా భావించా. లవ్, యాక్షన్, సెంటిమెంట్ ఉన్న ఈ సినిమా నాకు చాలా మంచి సినిమా అవుతుంది' అని చెప్పారు.
'శంకర్ పిక్చర్స్ ప్రెజెంట్స్‌లో మేమంతా కలసి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాం. ఈ సినిమాకు మంచి నటీనటులు, టెక్నిషియన్స్ దొరికారు. మంచి కథతో తీస్తున్న ఈ చిత్రం అందరికీ కచ్చితంగా నచ్చుతుంది' అని నిర్మాత దేవరాజ్ పొత్తూరు అన్నారు.
దర్శకుడు నవీన్ రెడ్డి మాట్లాడుతూ, 'వచ్చే నెల నుంచి చిత్రీకరణ ఆరంభిస్తాం. ఈ సినిమాను సింగిల్ షెడ్యూల్లో పూర్తి చేయాలని ప్లాన్ చేశాం. ఈ సినిమాలో కాశీ గారు ఫాదర్ క్యారెక్టర్ చేస్తున్నారు,. పోసాని, సప్తగిరి ఇలా.. చాలా మంది ఆర్టిస్టులు ఉన్నారు' అని తెలిపారు. 'తెలుగులో నాకు ఇది మొదటి సినిమా. ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు ధన్యవాదాలు' అని హీరోయిన్ యషా శివకుమార్ చెప్పారు. ఈ చిత్రానికి కెమెరామెన్: సతీష్ ముత్యాల, సంగీతం: భీమ్స్ సిసిరోలియా, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ : కార్తీక్.