Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పథ్వీరాజ్ సుకుమారన్, షాజీ కైలాస్ కాంబినేషన్లో తెరకెక్కిన హై ఆక్టేన్ యాక్షన్ మాస్ ఎంటర్టైనర్ 'కడువా'. మ్యాజిక్ ఫ్రేమ్స్, పథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్ల పై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు. వివేక్ ఒబెరారు ప్రధాన పాత్ర, సంయుక్త మీనన్ కథానాయికగా కనిపించనున్నారు. పాన్ ఇండియా ఎంటర్టైనర్గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈనెల 30న విడుదల కానుంది.
ఈ నేపధ్యంలో హీరో పథ్వీరాజ్ మీడియాతో మాట్లాడుతూ, 'మలయాళంలో కొనాళ్ళుగా థియేటర్లో హాయిగా కూర్చుని, పాప్ కార్న్ తింటూ విజల్స్ వేస్తూ ఎంజారు చేసే మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ సినిమాలు రాలేదు. ఈ సినిమా చేయడానికి కారణం ఇదే. 'కడువా' అంటే పులి. ఇందులో హీరో పేరు కడువకున్నేల్ కురువచన్.. షార్ట్ కట్లో కడువా అని ఉంటుంది. ఈ కథ వినగానే ఇది షాజీ కైలాస్ సినిమా అనిపించింది. ఇది తప్పకుండా ఆయన మార్క్‌తో ప్రేక్షకులను అలరిస్తుంది. ఒక వ్యక్తితో చిన్న ఇగో సమస్య మొదలై పెద్ద హింసకు దారితీస్తుంది. 'అయ్యప్పన్ కోషియమ్'లో కూడా ఇగో పాయింట్ ఉంటుంది. అయితే అది సినిమాటిక్‌గా చాలా రియల్ స్టొరీ. కానీ ఇది కమర్షియల్, లార్జర్ దెన్ లైఫ్ సినిమా. నేను చిరంజీవిగారికి అభిమానిని. 'లూసిఫర్' రీమేక్‌కి డైరెక్షన్ చేయమని అడిగారు. వేరే ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉండటంతో చేయలేకపోయా. 'లూసిఫర్2' చేస్తున్నా. దీని రీమేక్‌కి అవకాశం వస్తే కచ్చితంగా చేస్తాను' అని అన్నారు.