Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన భారీ బడ్జెట్ త్రీడీ మూవీ 'విక్రాంత్ రోణ'. జూలై 28న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుంది. అనూప్ భండారి దర్శకుడు.
సల్మాన్‌ఖాన్ ఫిలింస్ సమర్పణలో జీ స్టూడియోస్, కిచ్చా క్రియేషన్స్ బ్యానర్‌పై ఉత్తరాదిన రిలీజ్ అవుతున్న ఈ చిత్రాన్ని షాలిని ఆర్ట్స్ బ్యానర్‌పై జాక్ మంజునాథ్ నిర్మించారు.
ఇన్వెనియో ఆరిజన్స్ బ్యానర్‌పై అలంకార్ పాండియన్ ఈ సినిమాకు సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా తెలుగు ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో నిర్వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత షాలిని మంజునాథ్ మాట్లాడుతూ, 'ఈ సినిమా ఇండిస్టీ ప్రపంచంలోనే మరిన్ని కొత్త హిస్టరీలను క్రియేట్ చేయనుంది. సినిమాను త్రీడీలో రూపొందించాం. కిచ్చా సుదీప్గారి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన వల్లనే ఇంత పెద్ద ప్రాజెక్ట్‌ను త్వరగా పూర్తి చేయగలిగాం' అని చెప్పారు.
'అన్నపూర్ణ స్టూడియోలో ఎక్కువగా సెట్స్ వేసి చిత్రీకరించాం. నాగార్జునగారు కొన్ని సీన్స్ చూసి నన్ను పిలిచి ప్రత్యేకంగా అభినందించారు. అలాగే రామ్ గోపాల్ వర్మ గారు మా సినిమాను చూసి ప్రశంసించటమే కాకుండా సపోర్ట్ చేస్తూ వచ్చారు' అని దర్శకుడు అనూప్ భండారి తెలిపారు. 'ఈ సినిమా రఫ్ వెర్షన్ చూసి చాలా ఆశ్చర్యపోయాను. స్టోరీ, సుదీప్ పెర్ఫామెన్స్, డైరెక్టర్ అనూప్ తీసిన తీరు.. ఈ మధ్య కాలంలో నేను చూసిన బెస్ట్ ఫైట్ సీక్వెన్స్‌లున్నాయి' అని రామ్ గోపాల్ వర్మ చెప్పారు.
అఖిల్ అక్కినేని మాట్లాడుతూ, 'ఈ సినిమా కన్నడ ఇండిస్టీ నుంచి మరో పాత్ బ్రేకింగ్ మూవీ అవుతుంది' అని అన్నారు. 'అనూప్ నా కార్యెక్టర్‌ను గొప్పగా చూపించడానికి ఎంతో ఆలోచించాడు. జూలై 28కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను' అని కిచ్చా సుదీప్ తెలిపారు.