Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఎం.ఎస్.రాజు దర్శకత్వం వహించిన '7 డేస్ 6 నైట్స్' ఈ శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రానికి అన్ని ఏరియాలు, అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి హిట్ టాక్ లభిస్తోన్న నేపథ్యంలో సక్సెస్ మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఎంఎస్ రాజు మాట్లాడుతూ, 'థియేటర్‌కు వెళ్లి సినిమా చూశా. ప్రేక్షకుల స్పందన చూశాక చాలా సంతోషంగా అనిపించింది. మంచి ఎంటర్టైన్మెంట్, మంచి ఎమోషన్... ఈ రెండూ ఒకేలా వెళుతుంటే ఆడియన్స్ బాగా ఎంజారు చేశారు. ప్రతి షోకి అన్ని చోట్ల కలెక్షన్స్ పెరుగుతున్నాయి. మౌత్ పబ్లిసిటీ చాలా పవర్ ఫుల్. యూత్‌కు విపరీతంగా నచ్చింది. మార్నింగ్ షో చూసిన ఫ్యామిలీ ఆడియన్స్ కూడా ఎంజారు చేశారు. సినిమా అద్భుతంగా ఉందన్నారు. అయితే కొన్ని చోట్ల టికెట్ రేటు రూ.200 పెట్టారు. చిన్న సినిమాకు అంత డబ్బులు పెట్టి ఎందుకు వస్తారు?, కాబట్టి చిన్న సినిమాలకు టికెట్ ధరలు తగ్గించండి. లేకపోతే చిన్న సినిమాలు చాలా సమస్యల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది' అని చెప్పారు.