Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మిస్తున్న చిత్రం 'సీతా రామం'.
యుద్ధ నేపథ్యంలో అందమైన ప్రేమకథగా ఈ చిత్రాన్ని దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రంలో మణాళిని ఠాకూర్ హీరోయిన్గా నటించగా, రష్మిక మందన్న కీలక పాత్ర పోషించారు. తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు.
ఈ చిత్ర టీజర్ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్‌గా జరిగింది. ఈ సందర్భంగా దుల్కర్ సల్మాన్ మాట్లాడుతూ,'టీజర్‌కి వండర్ ఫుల్ రెస్పాన్స్ వచ్చింది. ఇంతకంటే వండర్ ఫుల్‌గా సినిమా ఉండబోతుంది. ఇదొక మెమరబుల్ మూవీ. అద్భుతమైన లోకేషన్స్‌లో చిత్రీకరించాం. దేశంలో చాలా ప్రదేశాలు చూసే అవకాశం దక్కింది. విశాల్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. కథ గొప్పగా, విజువల్ వండర్‌గా ఉంటుంది' అని అన్నారు.
'ప్రేక్షకులకు వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఇవ్వడానికే వందల మంది రెండేళ్ళుగా కష్టపడ్డాం. దుల్కర్‌ని లెఫ్టినెంట్ రామ్ పాత్రలో బాగా ఇష్టపడతారు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది. ఈ ప్రయాణంలో సపోర్ట్‌గా నిలిచిన దుల్కర్ , నిర్మాత స్వప్న గారికి థ్యాంక్స్' అని దర్శకుడు హను రాఘవపూడి తెలిపారు.