Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీమతి జగన్మోహని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టైన్మెంట్, డ్రమ్‌స్టిక్స్ ప్రొడక్షన్ హౌస్ పతాకంపై అరుణ్ విజయ్, ప్రియా భవానీ శంకర్ జంటగా రూపొందిన చిత్రం 'ఏనుగు'. హరి దర్శకత్వంలో సీహెచ్ సతీష్ కుమార్ నిర్మిస్తున్న ఈ సినిమాకి సెన్సార్ సభ్యులు 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. జులై 1న గ్రాండ్‌గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్బంగా చిత్ర నిర్మాతలు మాట్లాడుతూ, ''సింగం' సిరీస్, 'పూజ' సినిమాలతో కమర్శియల్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్‌గా పేరు తెచ్చుకున్న హరి నెక్స్ట్ సినిమా 'ఏనుగు'. ప్రస్తుతం సమాజంలో ఉన్న సమస్యలను ఎంటర్టైన్మెంట్తోపాటు ప్రేక్షకులకు మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాం. తెలుగులో దర్శకుడు హరి చేసిన గత సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో ఈ కమర్శియల్ యాక్షన్ ఎంటర్టైనర్ కూడా కూడా అంతే పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది. ఈ సినిమా చూసిన సెన్సార్ బోర్డు వారు సినిమా చాలా బాగుందని 'యు/ఎ' సర్టిఫికెట్ ఇచ్చారు. ఈ సినిమాకు జి.వి. ప్రకాష్ కుమార్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు. గోపీనాథ్‌గారు ఎక్సలెంట్ మేకింగ్ ఇచ్చారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ ఎమోషనల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ను జూలై 1న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నాం' అని చెప్పారు.
దర్శకుడు హరి మాట్లాడుతూ, 'ఇందులో ఎమోషనల్ కంటెంట్‌తో పాటు మంచి ఫ్యామిలీ వ్యాల్యూస్ చూపించాం. ఈ సినిమాలో యాక్షన్, సెంటిమెంట్, ఎమోషన్, కామెడీ ఇలా ప్రేక్షకులకు కావలసిన అన్ని అంశాలు ఇందులో ఉన్నాయి. ఫ్యామిలీతో వచ్చి చూసే ప్రతి ఒక్కరికీ ఈ సినిమా కచ్చితంగా నచ్చుతుంది' అని అన్నారు.