Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లావణ్య త్రిపాఠీ ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం 'హ్యాపీ బర్త్ డే'. రితేష్ రానా దర్శకుడు. మైత్రీ మూవీ మేకర్స్‌తో కలిసి క్లాప్ ఎంటర్టైన్మెంట్ సంస్థ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాయి. నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రి), హేమలత పెదమల్లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా జూలై 8న విడుదల కానుంది. ఈ సినిమాలో నరేష్ ఆగస్త్య, సత్య, వెన్నెల కిషోర్, గుండు సుదర్శన్ తదితరులు ముఖ్యపాత్రల్లో నటిస్తున్నారు. 'ఈ చిత్రం నుంచి ఇప్పటికే విడుదల చేసిన టీజర్ వైవిధ్యంగా ఉండి ఇంట్రెస్ట్ క్రియేట్ చేసింది. ఒక్కొక్కటిగా రివీల్ చేస్తున్న లీడ్ క్యారెక్టర్స్ కూడా సరికొత్తగా ఉంటూ ఆకట్టుకుంటున్నాయి. ప్రేక్షకులకు సరికొత్త అనుభూతినిచ్చే సినిమా ఇది. లావణ్య త్రిపాఠీ నటన ఫిదా చేస్తుంది. ప్రేక్షకుల్ని థ్రిల్ చేసే ఈ సినిమా మంచి విజయం సాధిస్తుందనే నమ్మకం ఉంది' అని చిత్ర బృందం తెలిపింది.
ఈ చిత్రానికి సంగీతం: కాలభైరవ, డిఓపీ: సురేష్ సారంగం, లైన్ ప్రాడ్యూసర్: అలేఖ్య పెదమల్లు, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాబా సాయి, చీఫ్ ఎగ్జిక్యూటివ్ నిర్మాత: బాల సుబ్రమణ్యం కేవీవీ, కథ-స్క్రీన్‌ప్లే-మాటలు-దర్శకత్వం: రితేష్ రానా.