Authorization
Mon Jan 19, 2015 06:51 pm
ఆకాష్ పూరి, గెహనా సిప్పీ జంటగా జీవన్ రెడ్డి తెరకెక్కించిన సినిమా 'చోర్ బజార్'. ఈ చిత్రాన్ని ఐవీ క్రియేషన్స్ పతాకంపై వీఎస్ రాజు నిర్మించారు. యూవీ క్రియేషన్స్ సమర్పణలో తాజాగా ప్రేక్షకుల ముందుకొచ్చిందీ సినిమా. ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుని, మాస్, క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం సక్సెస్‌మీట్ నిర్వహించారు.
ఈ సందర్భంగా హీరో ఆకాష్ పూరి మాట్లాడుతూ, 'మాస్ హీరోగా మెప్పించాననే పేరు ఈ సినిమాతో నాకు దక్కింది. నేను జనాల్లోకి హీరోగా వెళ్లిపోయాను అనే ప్రశంసలు దక్కుతున్నాయి. ఆ క్రెడిట్ దర్శకుడు జీవన్ రెడ్డికి ఇవ్వాలి. సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతోంది. ఫైట్ మాస్టర్ పథ్వీ కంపోజ్ చేసిన యాక్షన్ సీన్స్ ఆకర్షణగా నిలిచాయని చెబుతున్నారు. అలాగే సంగీతం, సినిమాటోగ్రఫీ, ఆర్ట్ వర్క్ ఇలా ప్రతి టెక్నీషియన్ మంచి ప్రతిభ చూపించారు. నా గత రెండు చిత్రాల కన్నా ఈ సినిమా చాలా గ్రాండ్‌గా ఉండటానికి కారణం నిర్మాత వీఎస్ రాజు. నాకు ఈ సినిమా బ్యూటిఫుల్ మెమొరీస్ ఇచ్చింది' అని చెప్పారు.
'కలర్‌ఫుల్ కమర్షియల్ సినిమా చేయాలన్న మా ప్రయత్నం ఇవాళ సక్సెస్ అయ్యింది. అన్ని ప్లేస్‌ల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇకపైనా మంచి కమర్షియల్ చిత్రాలు చేస్తాను' అని దర్శకుడు జీవన్ రెడ్డి తెలిపారు.
నిర్మాత వీఎస్ రాజు మాట్లాడుతూ, 'సినిమాను పెద్ద సక్సెస్ చేసిన ఆడియెన్స్
అందరికీ థ్యాంక్స్. సినిమా కోసం మేం పడిన శ్రమకు ఫలితాన్ని ఇచ్చారు. మీ
ఆదరణతో మరిన్ని మంచి చిత్రాలను నిర్మిస్తాం' అని అన్నారు.