Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సాయిధన్సిక, తేజ్ కూరపాటి, అభినవ్ మేడిశెట్టి, కె.వి.ధీరజ్, నవకాంత్, చమ్మక్ చంద్ర ప్రధాన తారాగణంగా నటించిన చిత్రం 'షికారు'. (యాన్ అన్లిమిటెడ్ ఫన్ రైడ్) అనేది ట్యాగ్‌లైన్. శ్రీసత్యసాయిబాబాగారి ఆశీస్సులతో నాగేశ్వరి (పద్మ) సమర్పణలో పి.ఎస్.ఆర్. కుమార్ (బాబ్జీ, వైజాగ్) నిర్మాతగా, శ్రీసాయి లక్ష్మీ క్రియేషన్స్ పతాకంపై హరి కొలగాని దర్శకత్వంలో రూపొందింది. ఈ సినిమా జూలై1న ప్రేక్షకుల ముందుకు రానుంది.
ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నాయిక సాయిధన్సిక మాట్లాడుతూ, 'ఈ సినిమాలో దర్శకుడు నాకు అందమైన పాత్ర ఇచ్చారు. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకొస్తున్నాం' అని చెప్పారు.
బెక్కం వేణుగోపాల్ మాట్లాడుతూ, 'దర్శకుడు హరి చెప్పిన కథ బాగా నచ్చింది. కమర్షియల్ హిట్ అనిపించింది. 'కబాలి' చూశాక ధన్సిక కరెక్ట్ అని భావించి ఎంచుకున్నారు. ఆమె రాకతో ఈ సినిమాపై మరింత నమ్మకం పెరిగింది. తొలి కాపీ చూశాను. చాలా బాగుంది. యూత్‌కు పైసా వసూల్ సినిమా. ఇందులో సర్ప్రైజ్ ఎలిమెంట్ కూడా ఉంది' అని తెలిపారు.
'సాయిధన్సిక అభినయం అద్భుతంగా ఉంది. రచయిత కరుణ, శ్యామ్ ఫొటోగ్రఫీ, శేఖర్ చంద్ర సంగీతం బాగా కుదిరాయి. ఆర్.ఆర్. అద్భుతంగా ఇచ్చారు. దిల్‌రాజు, సురేష్‌బాబు ఇలా పెద్దల సహకారంతో జులై 1న థియేటర్లలో రాబోతున్నాం' అని నిర్మాత బాబ్జీ అన్నారు. దర్శఖుడు హరి కొలగాని మాట్లాడుతూ, 'మాస్ ఎంటర్టైన్మెంట్తో సినిమా తీశాం. మేం జూలై 1న వస్తున్నాం. కామెడీలో అరాచకం ఎలా ఉండబోతుందో మా సినిమా చూపిస్తుంది' అని చెప్పారు.