Authorization
Mon Jan 19, 2015 06:51 pm
పథ్వీరాజ్ సుకుమారన్, షాజీ కైలాస్ కాంబినేషన్లో తెరకెక్కిన చిత్రం 'కడువా'.
మ్యాజిక్ ఫ్రేమ్స్, పథ్వీరాజ్ ప్రొడక్షన్స్ బ్యానర్లపై లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ నిర్మించారు.
ఈ భారీ యాక్షన్ థ్రిల్లర్ డ్రామాలో బాలీవుడ్ స్టార్ వివేక్ ఒబెరారు మరో ప్రధాన పాత్ర పోషిస్తుండగా, 'భీమ్లా నాయక్' ఫేమ్ సంయుక్త మీనన్ కథానాయికగా నటించారు.
పాన్ ఇండియా ఎంటర్ టైనర్గా మలయాళం, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని ఈనెల 30న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేస్తున్నారు.
ఈ నేపథ్యంలో ఈ చిత్ర టీజర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ సందర్భంగా హీరో పథ్వీరాజ్ సుకుమారన్ మాట్లాడుతూ,'ఈ సినిమా నాకు చాలా ప్రత్యేకమైన సినిమా. నేను చేసిన సినిమాలు ఇక్కడ రిమేక్ కావడం ఆనందంగా ఉంది. 'భీమ్లా నాయక్' విడుదలైంది. అలాగే చిరంజీవి గారి 'గాడ్ ఫాదర్' కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది' అని తెలిపారు.
''కడువా' రాకింగ్ మూవీ. ఇద్దరు బలమైన వ్యక్తుల మధ్య ఒక బుల్ ఫైట్లా ఈ సినిమా ఉంటుంది. ఈ సినిమా చిత్రీకరణలో నిజంగానే రెండు పెద్ద బుల్స్ తీసుకొచ్చి ఫైట్ చేయించారు. ఈ సినిమా కచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది' అని వివేక్ ఒబెరారు చెప్పారు. నాయిక సంయుక్త మీనన్ మాట్లాడుతూ,' తెలుగు ప్రేక్షకులకు సినిమా అంటే ప్యాషన్. 'భీమ్లా నాయక్' విడుదలప్పుడు థియేటర్లో ఒక పండగ లాంటి వాతావరణం చూశాను. ఈ సినిమా చూస్తున్నపుడు కూడా అదే సెలబ్రేషన్స్ ఉంటాయని భావిస్తున్నా' అని అన్నారు.
మలయాళం నుండి మంచి సినిమాలు వస్తున్నాయి. వాస్తవానికి దగ్గరగా ఉండేవి, మెదడుకు పదునుపెట్టేవి, ఆలోచన రేకెత్తించే చిత్రాలుగా.. ఇలా చాలా జోనర్ చిత్రాలు వస్తున్నాయి. అయితే మాస్ కమర్షియల్ సినిమాని మలయాళం పరిశ్రమ మర్చిపోయిందనే భావన కలిగింది. ప్రేక్షకులు అమితంగా ఎంజారు చేసే మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమాలు రావడం తగ్గింది. అలాంటి మాస్ యాక్షన్ కమర్షియల్ ఎంటర్టైనర్ని ప్రేక్షకుల ముందుకు తీసురావాలని భావించి ఈ సినిమా చేశా.
- పృథ్వీరాజ్ సుకుమారన్