Authorization
Mon Jan 19, 2015 06:51 pm
వైష్ణవ్ తేజ్, కేతికా శర్మ జంటగా నటిస్తున్న సినిమా 'రంగ రంగ వైభవంగా'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పి బ్యానర్‌పై బాపినీడు.బి సమర్పణలో, తమిళంలో 'అర్జున్ రెడ్డి' చిత్రాన్ని తెరకెక్కించిన డైరెక్టర్ గిరీశాయ దర్శకుడిగా బి.వి.ఎస్. ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న చిత్రమిది. అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఈ సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. ఈ నేపథ్యంలో సోమవారం ఈ చిత్ర టీజర్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ మాట్లాడుతూ, 'మెగా హీరోలందరితోనూ సినిమాలు చేశాను. ఇప్పుడు వైష్ణవ్ తేజ్‌తో ఈ సినిమా చేశాను. సినిమా రిలీజ్‌కి సిద్ధంగా ఉంది. అన్ని సినిమాలు హిట్ అయినట్లే ఈ సినిమా కూడా హిట్ అవుతుందని భావిస్తున్నాను' అని అన్నారు.
'టీజర్ అందరికీ నచ్చే ఉంటుంది. సినిమా కూడా కచ్చితంగా నచ్చుతుంది. ఓ మంచి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాం' అని హీరో వైష్ణవ్ తేజ్ చెప్పారు. చిత్ర దర్శకుడు గిరీశాయ మాట్లాడుతూ, 'పాటలు రిలీజ్ అయినప్పుడు చాలా మంది నాకు ఫోన్ చేసి, వైష్ణవ్ లుక్ అదిరిపోయిందని, చించేశారని అన్నారు. నిజంగానే మా సినిమాలో వైష్ణవ్ కొత్తగా కనిపిస్తారు. ఆయన ఎనర్జీ నెక్ట్స్ లెవల్లో ఉంటుంది. ఆయన ఎనర్జీనే మా సినిమా. మా సినిమాను చాలా హ్యాపీగా పూర్తి చేశామంటే నిర్మాత ప్రసాద్, బాపినీడుగారే కారణం. రాధగా కేతికా శర్మ అద్భుతంగా నటించింది. దేవిశ్రీ ప్రసాద్‌గారితో కలిసి పనిచేయడం చాలా ఆనందంగా ఉంది. సినిమాటోగ్రాఫర్ శ్యామ్ మంచి విజువల్స్ ఇచ్చారు. అవినాష్ కొల్ల మంచి ఎఫర్ట్ పెట్టి వర్క్ చేశారు. ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ లాంటి అర్జున్ ప్రసాద్ క్యారెక్టర్‌ను నవీన్ చంద్రగారు చేశారు. ఈ సినిమా చూసి నా సామి రంగా.. రంగ రంగ వైభవంగా అని మెగా ఫ్యాన్స్ ఫీల్ అవుతారు' అని తెలిపారు. 'ఈ మూవీలో చాలా మంచి పాత్ర చేశాను. అందరికీ నచ్చుతుంది. ముఖ్యంగా వైష్ణవ్, కేతికా శర్మ చాలా బాగా చేశారు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు' అని నవీన్ చంద్ర అన్నారు.