Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కిరణ్ అబ్బవరం హీరోగా, గోపీనాథ్ రెడ్డి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సమ్మతమే'. యూజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై కంకణాల ప్రవీణ నిర్మించిన ఈ చిత్రం ఈనెల 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై, పీపుల్స్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది.
ఈ నేపథ్యంలో దర్శకుడు గోపీనాథ్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, 'మా చిత్రానికి ప్రేక్షకుల నుండి వస్తున్న ఆదరణ చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది. ప్రేక్షకుల రెస్పాన్స్ పూర్తిగా సమ్మతమే (నవ్వుతూ). నేను ఏ కథ చెప్పినా, బలమైన పాయింట్ ఉండాలని అనుకున్నాను. అలా తయారు చేసిందే ఈ సినిమా కథ. అయితే ఈ సినిమా విడుదల తర్వాత ఫ్లాట్ నేరేషన్ అని విమర్శలు వచ్చాయి. కానీ ఫ్లాట్ నేరేషన్ కూడా ఒక నేరేషన్ స్టయిలే. నాన్ లీనియర్‌గా అక్కడిది ఇక్కడ కట్ చేసి జంప్స్ చేసి చెప్పొచ్చు. ఇలా అయితే కథానాయకుడితో కనెక్షన్ మిస్ అయిపోతుంది. అతడి ఎమోషన్ని ఆడియన్ ఫీల్ అవ్వలేడు. అందుకే ఫ్లాట్ నేరేషన్ స్టయిల్ని ఫాలో అయ్యా. నా మీద నమ్మకంతో మా అమ్మ (ప్రవీణ) ఈ చిత్రాన్ని నిర్మించారు. బిజినెస్ పరంగా చాలా హ్యాపీగా ఉన్నాం. అలాగని ఎక్కువ లాభాలు వచ్చాయని చెప్పను. అయితే పెట్టిన ప్రతి రుపాయీ వచ్చింది. నేను, కిరణ్ అన్నదమ్ముల్లా ఉంటాం. 'రాజా వారు రాణి గారు', 'ఎస్ఆర్ కళ్యాణ మండపం' తర్వాత ఈ సినిమా మొదలుపెట్టాం. సంగీత దర్శకుడు శేఖర్ చంద్రగారు చాలా సపోర్ట్ చేశారు. మంచి ఆల్బమ్ ఇచ్చారు. ప్రస్తుతం రెండు, మూడు అవకాశాలొచ్చాయి. ఇందులో భాగంగా ఫీమేల్ ఓరియంటెడ్ కథతో సినిమా చేయాలనుకుంటున్నా. ఏ సినిమా చేసినా ఫ్యామిలీ ప్రేక్షకులందరికీ నచ్చేలా ఉండేలా చూసుకుంటాను' అని తెలిపారు.