Authorization
Mon Jan 19, 2015 06:51 pm
జైద్ ఖాన్, సోనాల్ మోన్‌టైరో జంటగా రూపొందుతున్న చిత్రం 'బనారస్'. త్వరలోనే ఈ సినిమా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ కానుంది.
జయతీర్థ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి తిలక్‌రాజ్ బల్లాల్ నిర్మాత. అజనీష్ లోక్‌నాథ్ సంగీత సారథ్యం వహించిన ఈ సినిమా నుంచి 'మాయ గంగ' పాటను మంగళవారం చిత్ర యూనిట్ విడుదల చేసింది.
ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో డైరెక్టర్ సుకుమార్ మాట్లాడుతూ, ''మాయ గంగ..' పాట బ్యూటీ ఫుల్ మెలోడి. కె.కె. అద్భుతంగా పాట రాశాడు. జయతీర్థ డైరెక్ట్ చేసిన 'బెల్ బాటమ్' గురించి నేను చాలా విన్నాను. అన్నం ఉడకిందా లేదా అని చూడటానికి ఒక మెతుకు పట్టకుంటే చాలన్నట్లు 'బెనారస్' మూవీ గురించి ఈ 'మాయ గంగ..' సాంగ్ చెప్పేస్తుంది. చాలా చాలా బాగుంది. పాన్ ఇండియా లెవల్లో సినిమా పెద్ద హిట్ కావాలి' అని చెప్పారు. 'జైద్ ఖాన్‌కి సినిమాలంటే ఎంతో ప్యాషన్. బిజినెస్ చేసుకోమని తండ్రి చెబుతున్నా, సినిమా రంగంలోకి ఆసక్తిగా వచ్చాడు. 'పుష్ప' సినిమా ఇచ్చిన స్ఫూర్తితో మా సినిమాను పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేస్తున్నాం' అని నిర్మాత తిలరాజ్ బల్లాల్ అన్నారు. దర్శకుడు జయతీర్థ మాట్లాడుతూ, 'నేను డైరెక్ట్ చేసిన 'బెల్ బాటమ్' చిత్రాన్ని ప్రేక్షకులు ఆదరించారు. ఈ చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించబోతున్నాను' అని తెలిపారు. హీరో జైద్ ఖాన్ మాట్లాడుతూ, 'హీరోగా నేను వేస్తున్న తొలి అడుగు ఇది. ఆశీర్వదించాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు.