Authorization
Mon Jan 19, 2015 06:51 pm
''డార్లింగ్'గా ప్రేక్షకులు, అభిమానులు ముద్దుగా పిలుచుకునే మా ప్రభాస్ ఇంత పెద్ద పాన్ ఇండియా స్టార్ అవుతాడని ఊహించలేదు' అని ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు అన్నారు.
ప్రభాస్ హీరోగా పరిచయం అవుతూ నటించిన 'ఈశ్వర్' సినిమా సరిగ్గా నేటితో 20 ఏళ్ళు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆలిండియా రెబెల్ స్టార్ కష్ణం రాజు, ప్రభాస్ ఫాన్స్ అధ్యక్షుడు జెఎస్ఆర్ శాస్త్రి (గుంటూరు) ఆధ్వర్యంలో మంగళవారం కష్ణంరాజు నివాసంలో సెలెబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి ఆనందాన్ని పంచుకున్నారు. ప్రభాస్ గురించి కష్ణంరాజు మాట్లాడుతూ, 'జయంత్, అశోక్ కుమార్ ఎంతో బాధ్యతగా తీసిన 'ఈశ్వర్' మంచి విజయాన్ని అందుకుని, ప్రభాస్‌ని హీరోగా నిలబెట్టింది. ప్రభాస్ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగాడంటే అతని శ్రమ, పట్టుదలతోపాటు మా అభిమానుల అండదండలూ కారణం. ఒక నటుడిగానే కాకుండా సాటివారి పట్ల సహాయం చేసే గొప్ప గుణం ఉంది. ప్రభాస్ మరింత ఉన్నతంగా ఎదగాలి. నా ఆశీస్సులతోపాటు అభిమానుల అండదండలు ఎప్పుడూ ప్రభాస్‌కి ఉంటాయి' అని చెప్పారు.