Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అవికా గోర్, శ్రీరామ్ ప్రధాన తారలుగా ఎస్ఆర్ మూవీ మేకర్స్, అన్విత అవని క్రియేషన్స్ పతాకాలపై రూపొందిన చిత్రం 'టెన్త్ క్లాస్ డైరీస్'. అచ్యుత రామారావు.పి, రవితేజ మన్యం సంయుక్తంగా నిర్మించారు. అజరు మైసూర్ సమర్పకులు. ఈ చిత్రంతో ఛాయాగ్రాహకులు 'గరుడవేగ' అంజి దర్శకునిగా పరిచయం అవుతున్నారు. ఈ శుక్రవారం సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా దర్శకుడు 'గరుడవేగ' అంజి మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'ఈ సినిమా ఆహ్లాదకరంగా ఉంటూనే భావోద్వేగానికి గురి చేస్తుంది. ఆ ఎమోషన్ ఏంటనేది సినిమాలో చూడాలి. ఎమోషన్తోపాటు యాక్షన్, డ్రామా.. అన్నీ సినిమాలో ఉన్నాయి. మా నిర్మాత అచ్యుత రామారావు, ఆయన స్నేహితుల జీవితంలో జరిగిన కథ ఇది. ఆయన అప్పుడప్పుడూ మా జీవితంలో ఇలా జరిగిందని చెబుతూ ఉండేవారు. మా స్నేహితుల్లో ఒక అమ్మాయి ప్రేమించిన అబ్బాయి కోసం వెయిట్ చేస్తూ ఉండిపోయిందని చెప్పారు.హొఇన్స్ఫైరింగ్గా అనిపించింది. కథహొఇన్స్ఫైర్ చేయడంతో డైరెక్షన్ వైపు వచ్చాను. ఈ కథకు మిడిల్ ఏజ్డ్ పర్సన్ కావాలి. వినోదంతో పాటు ఎమోషన్ ఉంది. మంచి పెర్ఫార్మన్స్ ఇచ్చే హీరో కావాలి. శ్రీరామ్ గారితోహొనాది పదేళ్ల పరిచయం. ఇందులో హీరో పాత్రకు పర్ఫెక్ట్ అనిపించింది. ఆయనకు కథ చెప్పా. నచ్చడంతో వెంటనే ఓకే చెప్పారు.హొఅలాగే సినిమా చూస్తున్నప్పుడు హీరోయిన్ మన ఇంట్లో అమ్మాయిలా అనిపించాలి. అందుకే అవికా గోర్ని ఎంపిక చేసుకున్నాం. దర్శకులు జి.నాగేశ్వర రెడ్డి గారు కథ, స్క్రీన్ ప్లే అందించడంతో పాటు ప్రొడక్షన్ చేసిన 'బుజ్జి ఇలా రా' చిత్రానికి కూడా దర్శకత్వం వహించాను. అది కూడా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది' అని తెలిపారు.