Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నిహాల్ నందన్, అర్పిత లోహి హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'బాల్‌రాజు'. మణిబాల పతాకంపై ఒలాద్రి బాల లక్ష్మి నిర్మాణంలో వెంకట్‌రెడ్డి స్వీయ దర్శకత్వంలో ఈ సినిమా నిర్మితమైంది. సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమా జూలై 1న గ్రాండ్‌గా థియేటర్లలో విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో ఇటీవల అగ్ర నిర్మాత సి.కళ్యాణ్ ఈ చిత్ర ట్రైలర్‌ని రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ట్రైలర్ చాలా బాగుంది. ట్రైలర్ చూస్తుంటే, సినిమాని ఎప్పుడెప్పుడు చూడాలా అనే ఆసక్తి కలిగిస్తోంది. ఇదే ఈ సినిమాకి తొలి విజయం. ప్రేక్షకులు ఆదరించి ఈ సినిమాకి మంచి విజయాన్ని అందించాలని ఆకాంక్షిస్తున్నాను' అని తెలిపారు.
'ఈ సినిమా 'మృగం' సినిమాలా పెద్ద హిట్ అవుతుంది. నిహాల్ నందన్, అర్పిత లోహి, ఎ.కె.మణి అద్భుతంగా నటించారు. కథ మీద ఉన్న నమ్మకంతో మా నిర్మాత బాల లక్ష్మిగారు ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. నటి స్నిగ్ధనయని మా సినిమాతో సంగీత దర్శకురాలిగా ప్రేక్షకులకు పరిచయం అవుతున్నారు. మంచి మ్యూజిక్‌తోపాటు అందర్ని మెస్మరైజ్ చేసేలా బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌ని అందించారు. మా సినిమాటోగ్రాఫర్ రాకేష్ వర్మకి ఇదే మొదటి సినిమా అయినప్పటికీ అద్భుతమైన విజువల్స్ ఇచ్చాడు. ఎడిటర్ కళ్యాణ్ జలగం మంచి గ్రిప్పింగ్‌తో ఎడిటింగ్ చేశారు. కొత్త వాళ్ళందరం కలిసి ఓ మంచి సినిమాతో జూలై 1న ప్రేక్షకుల ముందుకొస్తున్నాం' అని దర్శకుడు వెంకట్‌రెడ్డి అన్నారు.