Authorization
Mon Jan 19, 2015 06:51 pm
'సర్కారు వారి పాట'తో బ్లాక్ బస్టర్ అందుకున్న అగ్ర కథానాయకుడు మహేష్ బాబు ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి విదేశీ విహార యాత్రలో ఉన్నారు. యూరప్ పర్యటన ముగించుకున్న అనంతరం ఇటీవలే అమెరికాకు షిఫ్ట్ అయ్యారు.
బుధవారం ఉదయం లెజెండరీ బిల్ గేట్స్‌ను మహేష్ బాబు దంపతులు కలిశారు. బిల్ గేట్స్‌కి పెద్ద అభిమానైన మహేష్ బాబు ఆయన్ని కలసిన సందర్భంలో థ్రిల్‌గా ఫీలయ్యారు. కోట్లాది మంది అభిమానులు మహేష్‌బాబుతో ఫోటోలు తీసుకోడానికి ఆరాటపడుతుంటారు. కానీ ఆ సూపర్‌స్టార్ మాత్రం అభిమానిగా మారి మైక్రోసాఫ్ట్ అధినేతతో ఫోటో దిగారు.
'బిల్‌గేట్స్ గారిని కలవడం చాలా ఆనందంగా ఉంది. ఈ ప్రపంచం చూసిన గొప్ప దార్శనికుల్లో ఆయన ఒకరు. నిజమైన స్ఫూర్తి' అని బిల్‌గేట్స్‌తో కలిసి దిగిన ఫొటోని ట్విట్టర్లో మహేష్‌బాబు పోస్ట్ చేశారు. ఈ ఫోటోలో మహేష్ సతీమణి నమ్రత కూడా ఉన్నారు.
మహేష్ బాబు తదుపరి చిత్రం హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్లో అగ్ర దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబినేషన్లో తెరకెక్కనుంది.