Authorization
Mon Jan 19, 2015 06:51 pm
కార్తికేయ, అఖిల నాయర్ జంటగా ఎన్.శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న సస్పెన్స్ థ్రిల్లర్ 'వాడు ఎవడు'. రాజేశ్వరి సినీ క్రియేషన్స్ పతాకంపై మాధురి, పూజిత సమర్పణలో తెరకెక్కుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, టీజర్‌ను సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'టీజర్ చాలా బాగుంది. యదార్ధ సంఘటనల ఆధారంగా నిర్మించిన ఈ చిత్రం ఘనవిజయం సాధించాలి' అని చెప్పారు. ఈ చిత్రానికి కథ, మాటలు, స్రీన్‌ప్లే అందించిన రాజేశ్వరి పాణిగ్రహి మాట్లాడుతూ, 'సమాజంలోని అసాంఘిక శక్తులను ఎదుర్కోలేని మహిళల అందమైన జీవితాలు ఎలా అర్ధాంతరంగా ముగుస్తున్నాయి?, వైజాగ్‌లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా తీసిన సినిమా ఇది' అని అన్నారు.
'ఈ చిత్రంలో 3 ఫైట్లు ఉన్నాయి. ప్రమోద్ కుమార్ సంగీత దర్శకత్వంలో 3 పాటలను వైజాగ్, ఒరిస్సాలో చిత్రీకరించాం. ఓ మంచి సందేశం ఇచ్చే సినిమా ఇది' అని దర్శక, నిర్మాత శ్రీనివాసరావు తెలిపారు.