Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీకాంత్, వరలక్ష్మి శరత్ కుమార్, రాహుల్ విజరు, శివాని రాజశేఖర్ కీలకపాత్రధారలుగా, 'జోహార'్, 'అర్జున ఫల్గుణ' చిత్రాల దర్శకుడు తేజ మర్ని దర్శకత్వంలో నిర్మాత బన్నీ వాస్ ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. జీఎ2 పిక్చర్స్ పతాకంపై ప్రొడక్షన్ నెం.8గా తెరకెక్కుతున్న ఈ సినిమా గురువారం ఫిల్మ్ నగర్ దైవసన్నిధానంలో పూజా కార్యక్రమాలతో మొదలైంది.
అల్లు అరవింద్ సమర్పణలో రూపొందుతున్న ఈ చిత్రానికి బన్నీ వాస్ తనయ బేబీ హన్విక క్లాప్ కొట్టారు. ఈ చిత్రానికి విద్య మాధురి మరో నిర్మాతగా, భాను ప్రతాప్ సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కంటెంట్ ప్రధానంగా సాగే ఈ చిత్రంలో మురళీ శర్మ, బెనర్జీ, పవన్ తేజ్ కొణిదెల తదితరులు ఇతర ముఖ్య పాత్రల్ని పోషిస్తున్నారు. ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : జగదీష్ చీకటి, సంగీతం : శక్తికాంత్ కార్తీక్, రైటర్: నాగేంద్ర కాశీ, ఆర్ట్ డైరెక్టర్: గాంధీ నడికుడికర్, కాస్ట్యూమ్ డిజైనర్: అపూర్వ రెడ్డి ఎరమల.