Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్.సురేష్ జంటగా నటించిన చిత్రం 'గంధర్వ'. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యఎస్.కె. ఫిలిమ్స్ సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుభాని నిర్మించారు. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా కొన్ని ప్రాంతాల్లో ఇప్పటి ట్రెండ్‌కు ప్రివ్యూ ప్రదర్శించారు. అన్నిచోట్ల సినిమా ఎంతో బాగుందని యువత మెచ్చుకోవడం విశేషం.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ఆ వివరాలను తెలియజేస్తూ గురువారం రామానాయుడు స్టూడియోలో పాత్రికేయుల సమావేశం ఏర్పాటు చేసింది. దర్శకుడు అప్సర్ మాట్లాడుతూ, 'ఇప్పటికే విడుదలైన పాటలకు, ట్రైలర్‌కు అనూహ్య స్పందన వచ్చింది. 'గంధర్వ' అనేది యూనిక్ పాయింట్. ఇంతవరకు ఎక్కడా రాని పాయింట్. ఫస్ట్ కాపీ చూశాక సురేష్‌కొండేటిగారు ఈ సినిమాను విడుదల చేస్తానని అనటం మాకు మొదటి విజయంగా భావించాం. ఖమ్మం, విజయవాడ, వైజాగ్ల్లో ప్రివ్యూ వేశాం. అద్భుతమైన స్పందన వచ్చింది. దాంతో ప్రేక్షకులు ఆదరిస్తారనే నమ్మకం ఏర్పడింది' అని చెప్పారు.
హీరో సందీప్ మాధవ్ మాట్లాడుతూ, 'సైన్స్ ఫిక్షన్ కావడంతో కథని చాలా కొత్తగా ఫీలవుతారు. ఈనెల 8న సినిమా చూసి ఆనందించండి' అని అన్నారు. ఎస్.కె. ఫిలింస్ అధినేత సురేష్ కొండేటి మాట్లాడుతూ, 'సినిమా చూశాక బాగా నచ్చి విడుదల చేస్తున్నాను. మరో బ్లాక్ బస్టర్‌ను మా బ్యానర్ ద్వారా అందించబోతున్నాం. పవన్ కళ్యాణ్ అభిమానులకు ఈ సినిమా పండుగే పండుగ' అని తెలిపారు.