Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్, మంచు ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై డా.మంచు మోహన్ బాబు, మంచు లక్ష్మి కాంబినేషన్లో రూపొందిన తొలి చిత్రానికి 'అగ్ని నక్షత్రం' టైటిల్ని ఖరారు చేశారు.
ప్రతీక్ ప్రజోష్ దర్శకత్వంలో మోహన్ బాబు, లక్ష్మీ ప్రసన్న ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్ర టైటిల్ లాంచ్ వేడుక శుక్రవారం ఉదయం ఘనంగా జరిగింది.
తండ్రీ తనయలు మోహన్ బాబు, మంచు లక్ష్మి మొట్ట మొదటి సారిగా కలిసి నటించడం విశేషం. మంచి ముహూర్తంలో 'అగ్ని నక్షత్రం' అనే టైటిల్ రివీల్ చేశారు. ఈ చిత్రానికి డైమండ్ రత్నబాబు కథ అందించారు. తాజాగా రిలీజైన లుక్ చూస్తుంటే ఇదొక పోలీస్ స్టోరీ వంటి విభిన్నమైన కథాంశంతో రూపొందిందని అర్థం అవుతుంది. సముద్రఖని, సిద్దిక్, చైత్ర శుక్ల, ద్వితీయ, విశ్వంత్, జబర్దస్త్ మహేష్ వంటి తారాగణంతో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ చివరి దశలో ఉంది' అని చిత్ర యూనిట్ తెలిపింది. ఈ చిత్రానికి దర్శకత్వం : ప్రతీక్ ప్రజోష్, సంగీతం: లిజో కె జోస్, డిఓపీ : గోకుల్ భారతి, ఎడిటర్ : మధురెడ్డి.