Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ పోతినేని నటించిన నూతన సినిమా 'ది వారియర్'. లింగుస్వామి దర్శకుడు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈనెల14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో భారీ ఎత్తున విడుదల కానుంది. అనంతపురంలో శుక్రవారం భారీ సంఖ్యలో విచ్చేసిన అభిమానులు, ప్రేక్షకుల మధ్య జరిగిన కార్యక్రమంలో ఈ చిత్ర ట్రైలర్‌ను డైరెక్టర్ బోయపాటి శ్రీను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'అనంతపురంలో జరుగుతున్న ఈ ఫంక్షన్‌తో... 'ది వారియర్' సినిమా సగం సక్సెస్ కొట్టేసింది. ఇక మిగిలింది థియేటర్లలో చూడటమే. మీ ఆశీర్వాదం టీమ్ అందరికి ఉండాలి' అని అన్నారు.
'మా ట్రైలర్ విడుదల చేసిన బోయపాటి గారికి థ్యాంక్స్. ఆయన చేతుల మీదుగా జరిగింది కాబట్టి సగం హిట్ అనుకుంటున్నాను. మంచి మనసున్న మనిషి లింగుస్వామి. సినిమాలో ప్రతి ఎమోషన్ ఆయన జెన్యూన్‌గా ఫీలై చేశారు. తెలుగునాట కమర్షియల్ హిట్స్ అయిన చాలా సినిమాల్లో సీన్లు లింగుస్వామి సినిమాల్లో సీన్లు చూసి స్ఫూర్తి పొందినవే అని నాకు ఆయా దర్శకులు చెప్పారు. మా సినిమా తమిళ్ ట్రైలర్ విడుదల చేసిన శివ కార్తికేయన్ గారికి థ్యాంక్స్' అని రామ్ పోతినేని చెప్పారు. దర్శకుడు లింగుస్వామి మాట్లాడుతూ, 'ఇక్కడ ప్రేక్షకుల ఎనర్జీ చూసిన తర్వాత ఇక్కడే ఉండిపోవాలని అనిపించింది. రజనీకాంత్ గారి సినిమాని చూడటానికి చిన్నతనంలో థియేటర్లకు వెళ్ళినప్పుడు జనాలను చూశా. మళ్ళీ ఆ స్థాయిలో జనాలు రావడం ఇక్కడ చూశా. మీ అందరిలో ఉన్న టోటల్ ఎనర్జీ .. రామ్ ఒక్కడిలో ఉంది. ట్రైలర్లో చూసి ఉంటారు. నేను ఏం అడిగినా ఇచ్చినా శ్రీనివాసా చిట్టూరి గారికి, పవన్ గారికి థ్యాంక్స్. నెక్స్ట్ మూవీ 'వారియర్ 2' కూడా వాళ్ళకు చేస్తాను' అని తెలిపారు.
'ఇక్కడి ప్రేక్షకుల ఎనర్జీ అద్భుతం. మా దర్శకుడు లింగుస్వామి గారు చాలా ఎనర్జిటిక్. దేవి శ్రీ ప్రసాద్ స్టార్ట్ చేసి పంపించిన బుల్లెట్ ప్రపంచం అంతా తిరుగుతోంది. టీమ్ అందరిలో సేమ్ ఎనర్జీ. కతి శెట్టి ఎనర్జీ బుల్లెట్ సాంగ్‌లో చూశారు కదా! వీళ్ళందరి ఎనర్జీ ఒక మనిషిలో ఇన్వెస్ట్ చేశారు. రామ్ చాలా చాలా ఎనర్జిటిక్ హీరో. అతనితో పని చేయడం గొప్ప అనుభవం. ఈ సినిమాతో నాకు మంచి ఫ్రెండ్ దొరికాడు' అని ఆది పినిశెట్టి అన్నారు.
హీరోయిన్ కతి శెట్టి మాట్లాడుతూ, 'ట్రైలర్ మాసీగా ఉంది కదా! నాకూ అలాగే అనిపించింది. ఒక ట్రైలర్ విడుదల చేయడానికి ఒక మాస్ డైరెక్టర్ వచ్చారు. బోయపాటి శ్రీను గారికి థ్యాంక్స్. ఆయన బ్లెస్సింగ్స్ మాతో ఉండాలని కోరుకుంటున్నాను' అని చెప్పారు. చిత్ర నిర్మాత శ్రీనివాసా చిట్టూరి, ఇతర యూనిట్ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్గొని చిత్ర విజయాన్ని ఆకాంక్షించారు. ఈ సినిమా పాటలు ఆదిత్య మ్యూజిక్ ద్వారా విడుదల అవుతున్నాయి.
- దర్శకుడు బోయపాటి శ్రీను