Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నాగశౌర్య, మాళవిక నాయర్ జంటగా శ్రీనివాస్ అవసరాల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ఫలానా అబ్బాయి- ఫలానా అమ్మాయి'. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ, దాసరి ప్రొడక్షన్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న చిత్రమిది. లండన్లోని పలు సుందరమైన ప్రదేశాలలో చిత్రీకరణ జరుగుతోంది. ప్రస్తుతం జరుగుతున్న చిత్రీకరణలో నాయక, నాయికలతోపాటు ప్రధాన తారాగణం పాల్గొంటున్నారు. 'విజయవంతమైన కాంబినేషన్లో ఈ సినిమా చేస్తున్నం దుకు హ్యాపీగా ఉంది' అని నిర్మాతలు టి.జి. విశ్వప్రసాద్, దాసరి పద్మజ, సహ నిర్మాత వివేక్ కూచి భొట్ల తెలిపారు.