Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సుధాకర్ జంగం, లావణ్య హీరో, హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రానికి 'అం అః' (ఎ డిఫరెంట్ క్రైమ్ థ్రిల్లర్ ట్యాగ్‌లైన్) పెట్టారు. రంగస్థలం మూవీ మేకర్స్, శ్రీ పద్మ ఫిలిమ్స్ బ్యానర్స్‌పై జోరిగె శ్రీనివాసరావు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. శ్యామ్ మండల దర్శకుడు. చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా నిర్మాత బెక్కెం వేణుగోపాల్ ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, 'ట్రైలర్ చాలా బాగుంది. ఈ టైటిల్‌ను మేం చాలా సార్లు పెట్టాలని అనుకున్నాం. మంచి టైటిల్. సినిమా కూడా మీ అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా. త్వరలోనే రిలీజ్ కాబోతోంది. ఈ కొత్త టీంను అందరూ ఆదరించాలని కోరుకుంటున్నాను' అని తెలిపారు.
'ఎన్నో సక్సెస్ ఫుల్ చిత్రాలను నిర్మించిన బెక్కెం వేణు గోపాల్ గారి చేతుల మీద మా సినిమా ట్రైలర్ రిలీజ్ అవ్వడం మాకు ఎంతో సంతోషంగా ఉంది. ఆయన బ్లెస్సింగ్స్ మాకు దొరకడం అదష్టం. నాకు ఈ అవకాశం ఇచ్చిన నిర్మాతకు థ్యాంక్స్' అని దర్శకుడు శ్యామ్ చెప్పారు. హీరో సుధాకర్ జంగం మాట్లాడుతూ, 'ఏ డిఫరెంట్ క్రైవమ్ థ్రిల్లర్ అనే ట్యాగ్ లైన్ ఈ సినిమా ఎలా ఉండబోతోందో చెప్పకనే చెప్పింది. అందర్నీ మెప్పించే సినిమా అవుతుందనే నమ్మకంతో ఉన్నాం' అని అన్నారు. 'లక్కీ మీడియా అధినేత బెక్కెం వేణుగోపాల్ గారు ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ఆయనకు మనస్పూర్తిగా కతజ్ఞతలు. టీం అంతా ఎంతో కష్టపడి, సినిమాను అద్భుతంగా తీర్చిదిద్దారు. జూలై చివరి వారంలో సినిమా విడుదలకు ప్లాన్ చేస్తున్నాం' అని నిర్మాత శ్రీనివాస రావు తెలిపారు.
రామరాజు, రవిప్రకాష్, రాజశ్రీ నాయర్, దువ్వాసి మోహన్, శుభోదయం సుబ్బారావు, తాటికొండ మహేంద్ర నాథ్, గని, ఉన్నికష్ణన్, మునీశ్వరరావు తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కో ప్రొడ్యూసర్: అవినాష్ ఎ.జగ్తప్, లైన్ ప్రొడ్యూసర్: పళని స్వామి, కథ : నవీన్ ఎరగాని, రైటర్స్ : కిరణ్ కుమార్ చప్రం, అజ్జు మహంకాళి, సినిమాటోగ్రాఫర్: శివా రెడ్డి సావనం, మ్యూజిక్: సందీప్ కుమార్ కంగుల, ఎడిటర్: జె.పి.