Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సత్యదేవ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రానికి 'కష్ణమ్మ' అనే టైటిల్‌ని ఖరారు చేశారు. నేడు (సోమవారం) సత్యదేవ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ కొత్త సినిమా పోస్టర్‌ను రిలీజ్ చేశారు. దర్శకుడు కొరటాల శివ సమర్పణలో అరుణాచల క్రియేషన్స్ బ్యానర్‌పై కష్ణ కొమ్మలపాటి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. వీవీ గోపాల కష్ణ దర్శకుడు.
ఇంటెన్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్లో కత్తి పట్టుకుని ఉన్న సత్యదేవ్ ఎంతో పవర్‌ఫుల్‌గా కనిపిస్తున్నారు. మంచి, చెడుల కలయిక నది నడత, పగ, ప్రేమ కలయిక మనిషి నడక అనే భావం ఎలివేట్ అయ్యేలా ఈ పోస్టర్ ఉండటం విశేషం. అలాగే 'కష్ణమ్మ' టైటిల్ కూడా ఎంతో పవర్ ఫుల్‌గా అనిపిస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ ఇప్పటికే పూర్తవ్వగా, ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. సెప్టెంబర్‌లో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.
లక్ష్మణ్, కష్ణ, అథిరా రాజ్, అర్చన, నంద గోపాల్, రఘు కుంచె, తారక్, సత్యం తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ : సన్నీ కూరపాటి, సంగీతం : కాళ భైరవ, ఎడిటర్ : తమ్మిరాజు, ఆర్ట్ డైరెక్టర్ : రామ్ కుమార్.