Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నితిన్ నటిస్తున్న పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ 'మాచర్ల నియోజకవర్గం'. ఈ చిత్రంలో కతి శెట్టి, కేథరిన్ థ్రెసా హీరోయిన్లుగా నటిస్తుండగా, ఓ స్పెషల్ సాంగ్ కోసం అంజలిని తీసుకున్నారు. ఈ సాంగ్ నుండి అంజలి లుక్‌ని మేకర్స్ ఆదివారం రిలీజ్ చేశారు. దీంతో ఈ సినిమాకి గ్లామర్ మరింత పెరిగింది.
స్పెషల్ సాంగ్ లుక్‌లో అంజలి అందర్నీ అలరిస్తోంది. హైదరాబాద్‌లో వేసిన భారీ సెట్లో చిత్రీకరించిన ఈ పాటలో అంజలి గ్లామర్ మెస్మరైజ్ చేయటం ఖాయమనే దీమాతో మేకర్స్ ఉన్నారు. ఎమ్.ఎస్.రాజశేఖర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా చిత్రీకరణ ముగింపు దశకు చేరుకుంది. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా చివరి దశలో ఉన్నాయి.
శ్రేష్ట్ మూవీస్ బ్యానర్‌పై సుధాకర్ రెడ్డి, నికితారెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పొలిటికల్ ఎలిమెంట్స్‌తో మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని రాజ్‌కుమార్ ఆకెళ్ల సమర్పిస్తున్నారు. ఆగస్ట్ 12న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాని భారీ స్థాయిలో థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్ చేశారు.