Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చర్స్, యూవీ క్రియేషన్స్ పతకాలపై గోపీచంద్, రాశి ఖన్నా జంటగా నటించిన చిత్రం 'పక్కా కమర్షియల్'. మారుతి దర్శకత్వంలో బన్నీ వాస్ నిర్మించిన ఈ చిత్రం విడుదలైన ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ తెచ్చుకుంది. మాస్ క్లాస్ తేడా లేకుండా అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతున్న నేపథ్యంలో చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి, పాత్రికేయుల సమక్షంలో సక్సెస్ సంబరాలను ఘనంగా జరుపుకున్నారు.
దర్శకుడు మారుతి మాట్లాడుతూ, 'మేము అనుకున్నట్లే ప్రేక్షకులు విజయాన్ని అందించారు. నా సినిమాల్లో ఉండే ఎంటర్ టైన్మెంట్ ఈ సినిమాలో కూడా ప్లే చేయడంతో ఎక్కడా ఫన్ తగ్గకుండా, చూసిన ప్రతి ఒక్కరూ బాగుందని మెసేజ్‌లు పెడుతున్నారు. అరవింద్‌గారు ఈ సినిమా విడుదలైన అన్నీ చోట్ల నుండి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పడంతో నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ప్రేక్షకులు మా సినిమాను ఆదరించడంతో షో తరువాత షోకు కలెక్షన్స్ పెరుగుతూ వస్తున్నాయి. గోపీచంద్‌ను చాలా బాగా చూపించారు, రాశి ఖన్నా ట్రాక్, రావురమేష్ విలనిజం చాలా బాగుందని, మేము అనుకున్న దానికంటే ఈ సినిమా బాగుందని చెపుతున్నారు' అని తెలిపారు.
'ఆడియన్స్‌కి మంచి మాస్ ఎంటర్టైనర్ సినిమా ఇస్తే బాగుంటుందని ఈ సినిమా తీశాం. మేము అనుకున్నట్లే అది ఈ రోజు అందరికీ రీచ్ అయ్యింది. కలెక్షన్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి.ఇప్పటికే ఆరు కోట్లు కలెక్ట్ చేసింది. దీన్ని బట్టి చూస్తే మా సినిమా క్లియర్ కమర్సియల్ హిట్ కింద పరిగణించవచ్చు' అని నిర్మాత బన్నీ వాసు అన్నారు. సహ నిర్మాత ఎస్కేఎన్ మాట్లాడుతూ, 'పక్కా కమర్షియల్ మౌత్ టాక్ అదిరిపోయింది. ఈ సినిమా అందర్నీ మెప్పించింది' అని చెప్పారు.