Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో, 'మత్తువదలరా' ఫేమ్ రితేష్ రానా దర్శకత్వం వహించిన చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి సమర్పణలో చిరంజీవి (చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన సర్రియల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఈనెల 8న ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో దర్శకుడు రితేష్ రానా శనివారం మీడియాతో ముచ్చటించారు.
ఇలాంటి జోనర్లో రాలేదు
ప్రస్తుతం మన సమాజంలో గన్స్ లీగల్ కాదు. అందరి దగ్గర గన్స్ ఉండటం కష్టం. అందుకే ఒక ఫేక్ వరల్డ్ క్రియేట్ చేద్దామనే ఆలోచన. సర్రియల్ కామెడీ అనే జోనర్ ఉంది. తెలుగులో ఇప్పటి వరకూ రాలేదు. ఖచ్చితంగా కొత్తగా ఉంటుందనిపించింది. కథ మొత్తం లాజికల్‌గానే ఉంటూనే కథ జరిగే ప్రపంచం మాత్రం ఊహాజనితంగా ఉంటుంది. స్క్రీన్ ప్లే మాత్రం నాన్ లీనియర్‌గా చేశాం. క్వెంటిన్ టొరొంటినో 'ఫల్ప్ ఫిక్షన్' తరహాలో స్క్రీన్‌ప్లే ఉంటుంది.
అందుకే ట్రైలర్‌ని అలా కట్ చేశాం
మా ట్రైలర్ చూసిన చాలా మందికి అర్ధం కాలేదనే మాట వినిపించింది. కథ అర్ధం కాకూడదనే ఉద్దేశంతోనే ట్రైలర్ అలా కట్ చేశాం. ఈ కథ ఎలాంటి ప్రపంచంలో జరుగుతుందనేది చెప్పి, పాత్రలను పరిచయం చేశాం. కథ ఏమిటనేది సినిమా చూస్తే అర్థమౌతుంది. లావణ్య త్రిపాఠిని ఒక టీవీ షోలో చూసి, ఈ క్యారెక్టర్ రాశాను. ఈ పాత్ర ఆమెకు కొత్తగా ఉండటంతోపాటు సరిగ్గా నప్పింది. ఇందులో ఆమె పేరు హ్యాపీ. ఆమె బర్త్ డే రోజు కథలో కీలక అంశాలు జరుగుతాయి. కాబట్టి ఈ సినిమాకి 'హ్యాపీ బర్త్ డే' అని టైటల్ పెట్టాం.
ఒక్కో చాప్టర్లో ఒక్కో తరహా కామెడీ
'మత్తువదలరా'లో ఒక కొత్త తరహా కామెడీ చూపించాను. ఇందులో కామెడీలో ఉన్న జోనర్స్ అన్నీ ఒకొక్క చాప్టర్లో టచ్ చేశాం. సినిమాలో ఏడు చాఫ్టర్లు ఉంటే.. విజువల్ కామెడీ, వ్యంగ్యం, పేరడీ, ఇలా ఒక్కొక్క చాప్టర్లో ఒక్కో తరహా కామెడీ ప్రయత్నించాం. ఈ సినిమాలో మ్యూజిక్‌కి చాలా ప్రాధాన్యత ఉంది. మేం సినిమాని చాలా క్రేజీగా తీస్తే, మ్యూజిక్‌ని డబుల్ క్రేజీగా ఇచ్చారు కాల భైరవ. ఈ సినిమా తర్వాత రెండు కథలు లాక్ అయ్యాయి. ఇవి కూడా చాలా కొత్తగా ఉంటాయి. అయితే వీటిల్లో ఏది ముందు సెట్స్ పైకి వెళ్తుందనేది ఇంకా డిసైడ్ కాలేదు.