Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చదలవాడ బ్రదర్స్ సమర్పణలో అనురాధ ఫిలిమ్స్ డివిజన్ పతాకంపై పి.సునీల్ కుమార్ రెడ్డి దర్శకత్వంలో చదలవాడ శ్రీనివాసరావు నిర్మించిన చిత్రం 'మా నాన్న నక్సలైట్'.
సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈనెల 8న విడుదలకు సిద్ధంగా ఉంది. 90వ దశకంలోని సామాజిక పరిస్థితుల నేపథ్యంలో సాగే ఒక నక్సలైట్ తండ్రి కథ ఇది. గాయకుడిగా, సంగీత దర్శకుడిగా, నటుడిగా తెలుగు ప్రేక్షకులకి సుపరిచితుడైన రఘు కుంచే కొండరుద్ర సీతారామయ్య పాత్రను పోషించారు. యువ జంటగా కష్ణ బూరుగుల, రేఖ నిరోషా నటించారు. నిర్మాత చదలవాడ శ్రీనివాసరావు మాట్లాడుతూ, 'ఇది హదయానికి హత్తుకునే సినిమా. కుటుంబ ప్రేక్షకులు భావోద్వేగానికి లోనయ్యే చిత్రమిది. నాకు బాగా నచ్చి నిర్మించిన సినిమా. గతంలో 'మాతదేవోభవ' చిత్రం చూసి ఎంత భావోద్వేగానికి లోనయ్యానో ఈ చిత్రం చూశాక కూడా అంతే అనుభుతికి లోనయ్యాను. సినిమా చూసిన ప్రతి ప్రేక్షకుడు తన తండ్రిని గుర్తు చేసుకుంటాడు' అని తెలిపారు. రేలంగి నరసింహారావు మాట్లాడుతూ, 'సునీల్ కుమార్ రెడ్డి గారు ఎప్పుడు ప్రజలకు ఉపయోగపడే చిత్రాలు చేస్తారు. స్టార్ హీరోలను నమ్మలేదు. కేవలం కథను మాత్రమే నమ్మి సినిమా చేస్తారు. ఈ సినిమా ట్రైలర్ చూస్తుంటే దాసరి నారాయణ రావు గారు తీసిన 'ఒసేరు రాములమ్మ' చిత్రం గుర్తుకు వచ్చింది. ట్రైలర్ చాలా ఎమోషనల్గా ఉంది. సినిమా కూడా మంచి విజయం సాధించాలి' అని అన్నారు.
'మా నాన్న నక్సలైట్ చిత్రం ఈనెల 8న విడుదల అవుతుంది. చదలవాడ శ్రీనివాసరావు గారు నిర్మించిన మంచి సినిమా ఇది. ఈ చిత్రం నేను నా తండ్రికి ఇచ్చే సెల్యూట్, నా కొడుక్కి ఇచ్చే గిఫ్ట్. ఈ చిత్రం చూసిన ప్రతి ఒక్కరు, వాళ్ళ తండ్రికి ఫోన్ చేసి నాన్న ఎలా ఉన్నారు అని అడుగుతారు. ప్రతి తండ్రి తన కొడుకుని దగ్గరకు తీసుకుంటాడని కోరుకుంటున్నాను. మంచి ఫీల్ ఉన్న ఈ చిత్రం అందరికీ నచ్చుతుంది' అని దర్శకుడు సునీల్ కుమార్ రెడ్డి తెలిపారు.