Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నందమూరి కళ్యాణ్ రామ్ టైటిల్ పాత్రలో నటిస్తున్న చిత్రం 'బింబిసార' (ఏ టైమ్ ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్ అనేది ట్యాగ్ లైన్). నందమూరి తారక రామారావు ఆర్ట్స్ పతాకంపై హరికష్ణ.కె ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
వశిష్ఠ్ దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. మంగళవారం హీరో కళ్యాణ్ రామ్ పుట్టిన రోజు సందర్భంగా సోమవారం ఈ చిత్ర ట్రైలర్‌ను విడుదల చేశారు.
ఈ నేపథ్యంలో హీరో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ, 'తాతగారు చేసిన 'పాతాళ భైరవి, గులేబకావళి కథ, జగదేవీరుని కథ', బాబారు చేసిన 'భైరవ ద్వీపం, ఆదిత్య 369', చిరంజీవిగారు చేసిన 'జగదేకవీరుడు అతిలోక సుందరి', మా జనరేషన్లో తమ్ముడు చేసిన 'యమదొంగ', రామ్ చరణ్ చేసిన 'మగధీర', రీసెంట్గా వచ్చిన ప్రభాస్ 'బాహుబలి' సినిమాలు గమనిస్తే, అన్ని అందమైన సోషియో ఫాంటసీ ఎలిమెంట్స్ ఉన్న సినిమాలను ప్రేక్షకులు ఆదరించారు. అలాంటి అందమైన గొప్ప చందమామ కథను ఆగస్ట్ 5న మీ ముందుకు తీసుకొస్తున్నాం. టీజర్, ట్రైలర్ మీకు నచ్చే ఉంటాయని అనుకుంటున్నాను. ఈ ఏడాది మా తాతగారు స్వర్గీయ ఎన్టీఆర్‌గారి శత జయంతి సందర్భంగా ఈ సిినిమాను ఆయనకి అంకితం చేస్తున్నాను' అని అన్నారు. 'కొత్త దర్శకుడు చెప్పిన కథ విని, నమ్మి సపోర్ట్ చేసిన నిర్మాత హరిగారికి, ప్రతి నిమిషం నువ్వు చేయగలవని ఎంకరేజ్ చేస్తూ వచ్చిన కళ్యాణ్ రామ్ గారికి థ్యాంక్స్. ఆగస్ట్ 5న మా 'బింబిసారుడు' యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో థియేటర్స్‌లో చూస్తారు' అని దర్శకుడు వశిష్ఠ్ అన్నారు.