Authorization
Mon Jan 19, 2015 06:51 pm
దుల్కర్ సల్మాన్, మణాల్ ఠాకూర్ జంటగా నటిస్తున్న చిత్రం 'సీతా రామం'. 1965 యుద్ధ నేపథ్యంలో ప్రేమకావ్యంగా ఈ చిత్రాన్ని దర్శకుడు హను రాఘవపూడి తెరకెక్కిస్తున్నారు. రష్మిక మందన్నా ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. వైౖజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలోని రెండో పాట 'ఇంతందం..' లిరికల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు.
ఈ సందర్భంగా దర్శకుడు హను రాఘవపూడి మాట్లాడుతూ, 'ఇది చాలా సవాల్‌తో కూడిన పాట. నాకు ఇష్టమైన పాట. ఈ పాటలో దుల్కర్ సల్మాన్, మణాల్ జోడి చూడముచ్చటగా ఉంది. లవ్లీ మెలోడిగా ఈ పాటను విశాల్ చంద్రశేఖర్ కంపోజ్ చేసిన తీరు మళ్ళీ మళ్ళీ వినాలనిపించేలా ఉంది. 'ఇంతందం దారి మళ్లిందా..భూమిపైకే చేేరుకున్నాదా..లేకుంటే చెక్కి వుంటారా..అచ్చు నీలా శిల్ప సంపద...' అంటూ కష్ణకాంత్ అందించిన సాహిత్యం మనసుని హత్తుకుంది. వేటూరి గారు గుర్తుకొచ్చారు. ఎస్పీ చరణ్ పాటని సుమధురంగా ఆలపించారు. పాటను అద్భుతంగా చూపించిన పీఎస్ వినోద్ గారికి కతజ్ఞతలు' అని తెలిపారు. 'ఈ పాట విన్న ప్రతిసారి మనసు హాయిగా ఉంటుంది. ప్రేక్షకులు 'సీతా రామం'ను అమితంగా ప్రేమిస్తారు. ప్రతి ఫ్రేమ్ ఒక పెయింటింగ్‌లా ఉంటుంది' అని నాయిక మణాల్ ఠాకూర్ అన్నారు. సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ, 'హను రాఘవపూడి గొప్ప సంగీత అభిరుచి ఉన్న దర్శకుడు. ఈ చిత్రంలో పాటలన్నీ వైబ్రెంట్‌గా ఉంటాయి. ప్రతి పాట మనసుని హత్తుకునేలా ఉంటుంది' అని తెలిపారు.
గేయ రచయిత కష్ణకాంత్ మాట్లాడుతూ,'వైజయంతీ మూవీస్, స్వప్న సినిమా బ్యానర్స్‌లో పాట రాసే అవకాశం రావడం అదష్టంగా భావిస్తున్నా. దర్శకుడు హను అచ్చమైన తెలుగు పాటలు రాయిస్తుంటారు. ఈ పాట కూడా స్వచ్ఛమైన తెలుగుపాట. సినిమా ఒక దశ్యం కావ్యంలా ఉంటుంది' అని అన్నారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఆగస్ట్ 5న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.