Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సంకేత్ తిరుమనీడి, మోనిక చౌహాన్ జంటగా నాగ్ ముంత దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం 'ధర్మచక్రం'. పద్మ నారాయణ ప్రొడక్షన్ బ్యానర్ పై జీపీ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రం ఇటీవల పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.
తొలి షాట్‌కు వరుణ్ క్లాప్ కొట్టగా, రాజశేఖర్ కెమెరా స్విచ్చాన్ చేశారు. ఎం. శ్రీధర్ గౌరవ దర్శకత్వం వహించారు.
ఈ సందర్భంగా నిర్మాత జీపీ రెడ్డి మాట్లాడుతూ, 'సమాజంలో ఆడపిల్లల మీద జరిగే అన్యాయాల మీద ఈ కథను దర్శకుడు రాసుకున్నారు. ఆయన చెప్పిన కథాకథనాలు నచ్చి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాను. ఓ మంచి కథతో రూపొందుతున్న ఈ సినిమా అందరికీ నచ్చుతుంది' అని తెలిపారు.
మోనిక చౌహాన్ మాట్లాడుతూ, 'నిర్భయ, దిశ ఘటనల్లాంటి పరిస్థితి ఏ ఆడపిల్లకు రాకూడదు. నేను ఈ చిత్రంలో ద్విపాత్రాభినయం చేస్తున్నాను' అని అన్నారు.
'ఎన్ని చట్టాలు వచ్చినా సమాజంలో ఆడపిల్లలకు భద్రత లేకుండా పోతోంది. మంచి సందేశంతో మీ ముందుకు రాబోతున్నాం' అని హీరో సంకేత్ చెప్పారు.
దర్శకుడు నాగ్ ముంత మాట్లాడుతూ, 'ఆడ వాళ్లకు స్వీయ సంరక్షణ నేర్పించేలా ఈ చిత్రం ఉంటుంది. హీరోయిన్ పోషిస్తున్న డ్యూయల్ రోల్ అందర్నీ మెప్పిస్తుంది. ఈ చిత్రాన్ని మా నిర్మాత జీపీరెడ్డిగారు ఎక్కడా రాజీపడకుండా నిర్మిస్తున్నారు. సినిమా షూటింగ్‌ని స్టార్ట్ చేశాం. సెప్టెంబర్‌లో ఈ చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తున్నాం.