Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బిగ్ బాస్ ఫేమ్ శ్వేతావర్మ, ప్రతాప్‌రెడ్డి, శ్రీకృష్ణ, నళినీకాంత్, నవీన్‌రాజ్ నటీనటులుగా రూపొందుతున్న చిత్రం 'కొండవీడు'.
సిద్దార్థ శ్రీ దర్శకత్వంలో ప్రతాప్ రెడ్డి నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 8న గ్రాండ్‌గా థియేటర్స్‌ల్లో రిలీజ్ కానుంది.
ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిర్మాత ప్రతాప్ రెడ్డి మాట్లాడుతూ, 'మా దర్శకుడు మంచి కథతో తీసిన ఈ సినిమాను చాలా ఫారెస్ట్ లొకేషన్స్‌లో షూట్ చేశాం. సినిమా బాగా వచ్చింది. అలాగే పాటలతో పాటు ట్రైలర్‌కి కూడా అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. డిస్ట్రిబ్యూటర్ రామకృష్ణ గారికి సినిమా నచ్చి, రిలీజ్ చేస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది' అని చెప్పారు.
'ప్రేక్షకులకు కావాల్సిన అన్ని అంశాలతో ఈ చిత్రాన్ని మా నిర్మాత ఎక్కడా రాజీపడకుండా నిర్మించారు. అందర్నీ మెప్పించే సినిమా ఇది' అని దర్శకుడు సిద్దార్థ శ్రీ తెలిపారు.
శ్వేతా వర్మ మాట్లాడుతూ,' ఇలాంటి మంచి సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన దర్శక, నిర్మాతలకు థ్యాంక్స్' అని అన్నారు.
'సునీల్ గారు ఫస్ట్ లుక్, శ్రీకాంత్ గారు ట్రైలర్ లాంచ్ చేశారు. ఫారెస్ట్ ఏరియాలో డిఫరెంట్ స్టోరీతో, డిఫరెంట్ జోనర్లో తీసిన ఈ సినిమాలో ప్రేక్షకులకు మంచి మెసేజ్ కూడా ఇవ్వడం విశేషం. ఈ సినిమా తప్పకుండా అలరిస్తుంది. ట్రైలర్‌తోపాటు సినిమా నచ్చడంతో థియేటర్స్‌లో దీన్ని రిలీజ్ చేస్తున్నాను. నాకు సపోర్ట్ చేస్తున్న థియేటర్స్ యాజమాన్యానికి కృతజ్ఞతలు' అని అన్నారు.