Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రామ్ పోతినేని నటించిన సినిమా 'ది వారియర్'. లింగుస్వామి దర్శకత్వం వహించారు. పవన్ కుమార్ సమర్పణలో శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై ప్రొడక్షన్ నెం.6గా శ్రీనివాసా చిట్టూరి నిర్మించారు. ఈనెల 14న ప్రపంచవ్యాప్తంగా తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమా భారీ ఎత్తున విడుదల కానుంది. ఇందులో విజిల్ మహాలక్ష్మిగా నటించిన కృతిశెట్టి మీడియాతో ముచ్చటించిన విశేషాలు..
- ఈ సినిమా కోసం లింగుస్వామిగారు ఫోన్ చేశారని అమ్మ చెప్పినప్పుడు చాలా ఎగ్జైట్ అయ్యాను. ఎందుకంటే ఆయన కథలు, హీరోయిన్ల పాత్రలు కొత్తగా ఉంటాయి.
- ఇందులో నా పాత్ర అందరూ ప్రేమించేలా ఉంటుంది. నా క్యారెక్టర్ పేరు విజిల్ మహాలక్ష్మి. ఆర్జేగా కనిపిస్తా. థియేటర్లో నా పాత్రకి ప్రేక్షకుల రియాక్షన్ చూసి నేనూ విజిల్స్ వేస్తా. అది మాత్రం పక్కా. అంతగా నా పాత్రకి ప్రేక్షకులు కనెక్ట్ అవుతారు.
- రామ్ ఎనర్జీని మ్యాచ్ చేయాలంటే చాలా ఎనర్జీ కావాలి. 'బుల్లెట్, విజిల్స్' సాంగ్స్ చూశారు కదా! అందరూ మా పెయిర్ బావుందని అంటున్నారు. సీన్స్ కూడా బావుంటాయి. ఆది పినిశెట్టి విలన్ రోల్లో అద్భుతంగా నటించారు.
- మా నిర్మాత శ్రీనివాసా చిట్టూరికి సినిమా అంటే ప్రేమ. చాలా మంచి మనిషి.
ఈ చిత్రంతో కోలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నందుకు ఎగ్జైటెడ్గా ఉన్నాను. సూర్యగారితో ఓ తమిళ సినిమా, నాగచైతన్య, వెంకట్ ప్రభుతో చేస్తున్న సినిమా తెలుగు, తమిళంలో ఉంటుంది. 'ది వారియర్' తర్వాత 'మాచర్ల నియోజకవర్గం'తో ప్రేక్షకుల ముందుకు వస్తా.