Authorization
Mon Jan 19, 2015 06:51 pm
లావణ్య త్రిపాఠి ప్రధాన పాత్రలో, 'మత్తువదలరా' దర్శకుడు రితేష్ రానా తెరకెక్కించిన చిత్రం 'హ్యాపీ బర్త్‌డే'. క్లాప్ ఎంటర్టైన్మెంట్, మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్స్ పై నవీన్ యెర్నేని, రవిశంకర్ యల మంచిలి సమర్పణలో చిరంజీవి(చెర్రీ), హేమలత పెదమల్లు నిర్మించిన సర్రియల్ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ ఇది. ఈ నెల 8న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్న నేపథ్యంలో నాయిక లావణ్య త్రిపాఠి మీడియాతో మాట్లాడారు.
ఈ సినిమా కోసం మొదటి సారి గన్ పట్టుకోవడం కొత్తగా అనిపించింది. జోనర్, కథ, కథనం కూడా కొత్తగా ఉంటాయి. సినిమా అద్భుతంగా వచ్చింది. ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుంది. ఇందులో హ్యాపీ అనే పాత్ర చేశాను. కథలో కీలకంగా ఉంటుంది. దర్శకుడు రితేష్ రానా కథ చెప్పినపుడు, కథ ఐడియా చాలా నచ్చింది. చాలా కొత్త జోనర్. సర్రియల్ వరల్డ్ థాట్ చాలా ఎగ్జైట్ చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాణంలో సినిమా చేయడం మరింత ఆనందాన్నిచ్చింది. బయట నేను చాలా జోవియల్‌గా ఉంటా. సరదాగా అందరితో జోక్స్ వేయడం నాకు ఇష్టం. అందుకే నాకు 'హ్యాపీ' పాత్ర చేయడం చాలా ఈజీగానే అనిపించింది.
నా పాత్ర అందరినీ బాగా నవ్విస్తుంది. పదేళ్ళ కెరీర్లో మీరు ఇంకా టాప్ లీగ్‌లోకి చేరుకోలేదని ఫీల్ అవుతున్నారా అని చాలా మంది అడుగుతున్నారు.
పదేళ్ళుగా ఇండిస్టీలో ఉండటం. అదే గొప్ప ఆనందం. అందరికి నెంబర్ వన్‌కి వెళ్ళాలని ఉండదు కదా. నా వర్క్‌ని ఎంజాయ్ చేస్తున్నాను.
ఎలాంటి ఒత్తిడి తీసుకోను. మనసుకు నచ్చిన పాత్రలు చేస్తున్నాను.
నా ప్రయాణం చాలా సంతృప్తికరంగా ఉంది. ప్రస్తుతం తమిళంలో అథర్వతో ఓ సినిమా చేస్తున్నా. ఇది దాదాపు పూర్తి కావచ్చింది.