Authorization
Mon Jan 19, 2015 06:51 pm
సందీప్ మాధవ్, గాయ్రతి ఆర్.సురేష్ జంటగా నటించిన చిత్రం 'గంధర్వ'. ఫన్నీ ఫాక్స్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై యఎస్.కె. ఫిలిమ్స్ సురేష్ కొండేటి సహకారంతో యాక్షన్ గ్రూప్ సమర్పిస్తున్న చిత్రమిది. అప్సర్‌ని దర్శకుడిగా పరిచయం చేస్తూ సుభాని నిర్మించారు. ఈ సినిమా ఈనెల 8న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఇందులో కీలక పాత్ర పోషించిన సాయికుమార్ మీడియాతో పలు విశేషాలను షేర్ చేసుకున్నారు.
'నేను ఈ మధ్య కన్నడలో 'రంగీ తరంగా' చేశాను. ఆస్కార్ దాకా వెళ్ళింది. ఆ సినిమా చేశాక కొత్తవాడితో ఎలా చేశావ్! అని నన్ను చాలామంది అడిగారు. కథని నమ్మానని చెప్పాను.అలాగే 'గంధర్వ' కథ కూడా చాలా కొత్తగా ఉంటుంది. కథలోని ఎమోషన్స్, ఫీలింగ్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. 'కలికాలం'లోని ఓ సీన్లో నాన్న చనిపోయాడు అనుకుంటాం. ఆయనే తిరిగి వస్తే ఎలా ఉంటుందనేది ఆసక్తికరంగా అనిపిస్తుంది. ఇందులోనూ అలానే ఉంటుంది. ఈ పాయింట్‌ను దర్శకుడు అప్సర్ అద్భుతంగా ప్రెజెంట్ చేశాడు. ఈ సినిమా లాజికల్‌గా అలాగే సైంటిఫిక్‌గా టెర్రిఫిక్‌గా ఉందని సురేష్‌కొండేటి చెప్పారు. ఆయన చెప్పారంటే సినిమా హిట్టే. ఇక ఈ సినిమాలో నా పాత్ర ఎవ్వరూ ఊహించని రీతిలో ఉంటుంది. సందీప్ చేసిన గత సినిమాలు చూశాను. చాలా టాలెంటెడ్. నేటి తరానికి చెందిన సత్యదేవ్, ప్రియదర్శితోనూ చేస్తున్నా. వారి నటనకు అనుగుణంగా నన్ను నేను మార్చుకుని నటిస్తున్నా. నటుడిగా, డబ్బింగ్ ఆర్టిస్టుగా యాభై ఏళ్ళ ప్రస్తానాన్ని పూర్తి చేసుకున్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నా. ప్రస్తుతం ధనుష్ 'సార్', నాని 'దసరా', తమిళంలో 'డీజిల్'. ఇందులో మూడు గెటప్లుంటాయి. అలాగే ఓ వెబ్ సీరీస్ చేయబోతున్నా' అని సాయికుమార్ అన్నారు.