Authorization
Mon Jan 19, 2015 06:51 pm
చాలాకాలం తర్వాత హీరోయిన్ కలర్స్ స్వాతి సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేయబోతున్నారు. నవీన్‌చంద్ర హీరోగా నటిస్తున్న తాజా చిత్రం 'మంత్ ఆఫ్ మధు' చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. శ్రీకాంత్ నాగోతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి తాజా ఫస్ట్‌లుక్ టైటిల్ పోస్టర్‌ను విడుదల చేశారు. టివి ప్రోగ్రామ్ 'కలర్స్' ద్వారా ప్రేక్షకులను ఆకట్టుకున్న స్వాతి అదే ట్యాగ్‌గా మార్చుకున్నారు. మొదటిసారి కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన 'డేంజర్' సినిమాలో నటించిన స్వాతి, అష్టాచెమ్మా, కార్తికేయ, త్రిపుర వంటి తెలుగు, తమిళ, మలయాళ చిత్రాల్లో హీరోయిన్గా నటించారు. పెళ్లి తర్వాత కొంతకాలం ఇండిస్టీకి దూరంగా ఉన్నారు.