Authorization
Mon Jan 19, 2015 06:51 pm
అగ్ర దర్శకుడు మణిరత్నం ఎంతో ప్రతిష్ఠాత్మకంగా రూపొందిస్తున్న చిత్రం 'పొన్నియన్ సెల్వన్ - 1'. తాజాగా ఈ సినిమాలో నందిని పాత్రలో నటిస్తున్న ఐశ్వర్య రారు ఫస్ట్‌లుక్‌ను చిత్రబృందం విడుదల చేసింది. ఇంతకుముందు మణిరత్నం దర్శకత్వం వహించిన 'గురు', 'రావణ్' చిత్రాల్లో నటించిన ఐశ్వర్య, 'రావణ్' తర్వాత సిల్వర్ స్క్రీన్‌పై కనిపించలేదు. మళ్లీ 'పొన్నియన్ సెల్వన్' సిరీస్‌తో రాబోతున్నారు. ఈ సినిమాలో ఐశ్వర్య ద్విపాత్రాభినయం చేస్తుండగా, అందులో ఓ పాత్రలో రాణి నందినిగా కనిపించబోతున్నారు. 'ప్రతీకారానికి అందమైన ముఖం.. ఇదిగో పజువూరు రాణి నందిని' అంటూ మేకర్స్ ఆమె పాత్రను పరిచయం చేశారు. ఈ చిత్రంలో విక్రమ్, కార్తి, త్రిష, శోభిత ధూళిపాళ్ళ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. కల్కీ కృష్ణమూర్తి రాసిన ప్రముఖ నవల 'పొన్నియన్ సెల్వన్' ఆధారంగా అదే పేరుతో ఈ చిత్రాన్ని రెండు భాగాలుగా రూపొందిస్తున్నారు. మొదటి భాగం పిఎస్-1 సెప్టెంబర్ 30న ఐదు భాషల్లో విడుదల కాబోతుంది.