Authorization
Mon Jan 19, 2015 06:51 pm
శ్రీ దుర్గ క్రియేషన్స్ పతాకంపై అఖిల్ రాజ్, అనన్య నాగల్ల జంటగా కొత్త చిత్రం తెరకెక్కుతోంది. సూర్య అల్లంకొండ దర్శకత్వంలో జి. ప్రతాప్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్ర కార్యక్రమాలు రామానాయుడు స్టూడియోలో ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా వచ్చిన దర్శకుడు విజరు కనకమేడల కార్యక్రమాలను ప్రారంభించగా దగ్గుపాటి అభిరామ్ హీరో హీరోయిన్లపై చిత్రీకరించిన తొలి ముహూర్తపు సన్నివేశానికి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సీనియర్ నటులు, రచయిత కాశీ విశ్వనాధ్ క్లాప్ కొట్టారు. దర్శకుడు జి. నాగేశ్వర్ రెడ్డి ఫస్ట్ షాట్ డైరెక్షన్ చేశారు. వచ్చే నెల నుంచి ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ప్రారంభంకానుంది.