Authorization
Mon Jan 19, 2015 06:51 pm
రుద్ర పిక్చర్స్ మరియు పిసిర్ గ్రూప్ సమర్పణలో శుక్ర దర్శకుడు సుకు, పూర్వాజ్ చేస్తున్న కొత్త సినిమా ''మాటరాని మౌనమిది''. మహేష్ దత్త, సోని, శ్రీవాస్తవ హీరో హీరోయిన్లుగా నటిస్తున్నారు. లవ్ స్టొరి, థ్రిల్లర్, బ్యాక్ డ్రాప్ లో ముల్టి జోనర్ గా రూపొందుతున్న ''మాటరాని మౌనమిది'' సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని ఆగష్టులో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్ర ప్రెస్ మీట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ సందర్భంగా దర్శకుడు సుకు పూర్వాజ్ మాట్లాడుతూ..కోవిడ్ టైమ్ లో మేము తీసిన శుక్ర సినిమా గతేడాది ఏప్రిల్ లో రిలీజ్ అయ్యింది. ఆ సినిమా మాకు చాలా పేరు తీసుకొచ్చింది. ఆ ప్రోత్సాహంతో మాటరాని మౌనమిది చిత్రాన్ని రూపొందించాను. ఈ సినిమా ఫస్ట్ కాపీ వచ్చింది. నిన్న కొంతమందికి ప్రివ్యూ వేశాము. అందరూ బాగుందన్నారు.